కర్నూలు జిల్లా గుడికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీకి ఆలయం నిర్మించనున్నారు. మాతాశ్రీ మందిరం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడు, శ్రీరాముడు సహా పలు దేవతామూర్తుల ఆలయాలతో పాటు అనాథ శరణాలయం, గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం.