AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్

సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 8:40 PM

Share

సౌత్ సినిమాల్లో మరోసారి సూపర్ హీరో కథల జోరు కనిపిస్తోంది. తేజ సజ్జా ‘జై హనుమాన్’, ‘మిరాయ్ 2’, ‘జాంబి రెడ్డి 2’తో పాటు అల్లు అర్జున్ ‘రాకా’, రాజమౌళి సమర్పణలో రూపొందుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ వంటి చిత్రాలు అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సూపర్‌వుమెన్ పాత్రల్లో మెరవడంతో ఈ జానర్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

సౌత్ సినిమాల్లో మళ్లీ సూపర్ హీరోల ఫీవర్ మొదలైందా.. మన స్టార్స్ అంతా ఇప్పుడు అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారా..? ఇండస్ట్రీలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల్లో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా..? అసలు తేజ సజ్జా నుంచి రాజమౌళి సినిమాల వరకు అంతా సూపర్ హీరో కాన్సెప్టుల వెనకే ఎందుకు పరుగులు తీస్తున్నారు.. హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తేజ సజ్జా.. మిరాయ్ సినిమాలోనూ సూపర్‌ పవర్స్ ఉన్న పాత్రలోనే నటించారు. బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి కథలే చేయడంతో తేజకు సూపర్ హీరో బ్రాండ్ పడిపోయింది. సెట్స్‌పై ఉన్న జై హనుమాన్, జాంబి రెడ్డి 2, మిరాయ్ 2 కూడా సూపర్ హీరో సినిమాలే. మరోవైపు వారణాసిలో మహేష్ పాత్రకు ప్రత్యేకమైన శక్తులు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. అట్లీ, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న రాకా సినిమాలో కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీని ఇప్పటివరకు చూడని ఓ సరికొత్త అవతారంలో.. స్పెషల్ పవర్స్ ఉన్న సూపర్ హీరోగా చూపించడానికి అట్లీ పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఒక సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమనే టాక్ నడుస్తుంది. రాజమౌళి సమర్పణలో ఆయన తనయుడు కార్తికేయ నిర్మిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలో ఆసక్తికరమైన ఫాంటసీ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’ కాన్సెప్ట్‌ను చూపిస్తున్నారు. మ్యాజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపిన ఈ కాన్సెప్ట్‌తో ఫహాద్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త మ్యాజిక్ చేయడం పక్కా అనిపిస్తోంది. కేవలం హీరోలే కాదు హీరోయిన్లు కూడా సూపర్‌వుమెన్‌గా మారిపోతున్నారు. ‘ఓ సుకుమారి’లో ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిగా నటించారు ఐశ్వర్య రాజేష్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ట్రైలర్‌లో ఆ పాత్ర రివీల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. గతేడాది ‘లోక’లో కళ్యాణి ప్రియదర్శన్ సైతం సూపర్ ఉమెన్‌గా రికార్డులు తిరగరాసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!

కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!

హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే

టాలీవుడ్‌కు 2026 లక్కీ ఇయర్.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల రేంజ్ కంబ్యాక్ రికార్డులు ఇవే!

Follow Us