AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

Varanasi: టీమ్ అంతా ‘వారణాసి’ జపమే.. కానీ మహేష్ మాత్రం సైలెంట్! సూపర్ స్టార్ మౌనం వెనుక అసలు ప్లాన్ ఏంటి?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 8:46 PM

Share

ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై దర్శకుడు, సహనటులు వరుసగా ఆసక్తికర అప్‌డేట్స్ ఇస్తుండగా, హీరో మహేష్ బాబు మాత్రం పూర్తి మౌనం పాటిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పలు వేదికల్లో సినిమా గురించి మాట్లాడుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే మహేష్ సోషల్ మీడియాలోనూ ఎలాంటి సమాచారం పంచుకోకపోవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి అప్‌డేట్స్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కో-స్టార్స్, డైరెక్టర్ ఎవరికి వారు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఊరిస్తున్నా.. మహేష్ నుంచి మాత్రం ఎలాంటి మాట రావడం లేదు. అసలు వారణాసి గురించి లీకులు ఇస్తున్న స్టార్స్ ఎవరు? మహేష్ మౌనం వెనుక స్ట్రాటజీ ఏంటి? దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఏదైనా ఈవెంట్‌కు వెళ్లారంటే చాలు వారణాసి గురించే డిస్కషన్‌ జరుగుతోంది. రీసెంట్‌గా అన్నేసి ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న జక్కన్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. తన స్టైల్‌లో అంచనాలు పెంచుతూ, సినిమా మీద ఇంటర్నేషనల్ లెవల్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఆ రేంజ్‌లో హైప్ ఇస్తున్నా, హీరో మహేష్ మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారణాసిలో మందాకినిగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తున్నారు. ఆ మధ్య హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రియాంక, వారణాసి టాపిక్ తీసుకొచ్చారు. తన షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటూనే, ఈ సినిమా గురించి ఇంటర్నేషనల్ మీడియాలోనూ హైప్‌ తీసుకొచ్చారు. ఆన్ లైన్ వేదికగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను కూడా ఖుషీ చేస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం తన ప్రమోషన్స్‌లో వారణాసి జపం చేశారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘ఐ, నోబడీ’ ప్రెస్ మీట్స్‌లోనూ వారణాసి టాపిక్ తీశారు. షూటింగ్ డీటైల్స్ రివీల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ఇలా టీమ్ అంతా ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే.. మహేష్‌ వైపు నుంచి మాత్రం ఆ రేంజ్ బజ్ కనిపించడం లేదు. సినిమా టీమ్ అంతా వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ మీద వారణాసి డీటైల్స్ పంచుకుంటున్నా.. మహేష్ బాబు మాత్రం సైలెన్స్‌ మెయిన్‌టైన్ చేస్తున్నారు. కనీసం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. మేకోవర్ సీక్రెట్‌గా ఉంచాలన్న జక్కన్న ఆర్డరో ఏమో కానీ బాబు సైలెన్స్ ఫ్యాన్స్‌ను మాత్రం టెన్షన్ పెడుతోంది. అందుకే సూపర్ స్టార్ నుంచి వారణాసికి సంబంధించి ఏదైనా సాలిడ్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘పుష్ప 2’ తర్వాత మరో బిగ్ సర్‌ప్రైజ్.. బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సూపర్ హీరో మూవీ?

Jason Sanjay: హీరోగా మారబోతున్న విజయ్ వారసుడు

సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!

Follow Us