AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jason Sanjay: హీరోగా మారబోతున్న విజయ్ వారసుడు

Jason Sanjay: హీరోగా మారబోతున్న విజయ్ వారసుడు

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 17, 2026 | 8:42 PM

Share

దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ సినిమాతో పరిచయం అవుతుండగానే హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయనను హీరోగా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ‘జన నాయగన్’ విడుదల నేపథ్యంలో ‘సిగ్మా’ చిత్రాన్ని ఆగస్టుకు వాయిదా వేయడం కూడా చర్చనీయాంశమైంది.

దళపతి విజయ్ వారసుడు జాసన్ సంజయ్ దర్శకుడి నుంచి ఉన్నట్టుండి హీరోగా మారబోతున్నారా..? నిన్నటి వరకు మెగాఫోన్ పట్టిన ఈ కుర్రాడు.. ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారా..? తమిళనాట ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ స్టార్ కిడ్‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అయిపోయిందా..? అసలేం జరుగుతుంది ముఖ్యమంత్రి తనయుడి విషయంలో..? విజయ్ కొడుకు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తారని కలలుగన్న అభిమానులకు షాక్ ఇస్తూ జాసన్ సంజయ్ దర్శకుడిగా మారారు. సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’ సినిమాతో మెగాఫోన్ పట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే కెమెరా వెనక ఉంటాడనుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. త్వరలోనే మేకప్ వేసుకుని హీరోగానూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తమిళ ఇండస్ట్రీలో ఓ బడా ప్రొడక్షన్ హౌస్ జాసన్ సంజయ్‌ను హీరోగా లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే ఒక క్రేజీ అప్‌డేట్ రాబోతుందని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇతర స్టార్ కిడ్స్‌లా కాకుండా ఇటు దర్శకత్వం, అటు నటనతో సంజయ్ సరికొత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జూలై 31న విడుదల కావాల్సిన ‘సిగ్మా’ సినిమా ఉన్నట్టుండి ఆగస్టుకు వాయిదా పడింది. జూలై 24న తన తండ్రి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా వస్తుండటంతో.. తండ్రి క్రేజ్ ముందు తన సినిమాకు గ్యాప్ ఇవ్వడమే కరెక్ట్ అని ఈ డెసిషన్ తీసుకున్నారు సంజయ్. మొత్తానికి అటు తండ్రి సినిమాతో పాటు.. ఇటు కొడుకు ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్ హీరోల సీజన్ స్టార్ట్!.. అతీంద్రియ శక్తులతో బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న సౌత్ స్టార్స్

Kriti Sanon: ఏ సినిమా పడితే అది కాదు.. క్వాలిటీ కథలకే ఓటేసిన కృతి సనన్.. పెళ్లిపైనా షాకింగ్ క్లారిటీ!

ఖాన్స్ త్రయానికి కష్టకాలం.. గాయాలు, ఫ్లాపులు, గ్యాపులతో బాలీవుడ్ బాద్‌షాల పరీక్ష!

కోలీవుడ్‌కు రెండో ఇల్లు మలేషియా.. స్టార్ హీరోల చూపంతా ఇప్పుడు అక్కడే!

హీరోలు అవసరం లేదు..! బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలివే

Follow Us