తొలి మూడు మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీ విఫలమైన మాట నిజమే అయినప్పటికీ, అతనిలోని ప్రతిభను తక్కువంచనా వేయలేం. క్రికెట్ లెజెండ్స్ కోహ్లీ, రోహిత్ శర్మల ఆరంభ దినాలను గుర్తుచేసుకుంటే, వైభవ్‌కు ఇదొక చిన్న పాఠం లాంటిదేనని స్పష్టమవుతోంది. ఈ యువ సంచలనం త్వరలోనే పుంజుకుని, తన బ్యాట్‌తో విమర్శకులకు గట్టి సమాధానం ఇస్తాడని ఆశిద్దాం.