హిస్టరీ క్రియేట్.. రికార్డులతో అదరగొట్టిన రోహిత్ శర్మ

25 october 2025

Samatha

సిడ్నీ ఆసిస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అదరగొట్టాడు,  వన్డే క్రికేట్‌లో 100 క్యాచ్‌లను పూర్తి చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు.

భారత్ మూడో వన్డేలో 100వ  క్యాచె‌తో రోహిత్ శర్మ , సౌరవ్ గంగూలీ(100) పేరిట ఉన్న రికార్డును సమం చేసి  అదరగొట్టేశాడు.

రోహిత్ శర్మ ఫస్ట్ స్లిప్‌లో నిలబడి, హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఓవెన్ క్యాచ్ అందుకున్నాడు. 276 ODIలలో రోహిత్ శర్మ  ఏకంగా 100 క్యాచెస్ అందుకున్నాడు.

శని వారం రోజున జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచెస్ అందుకొని, వన్డే క్రికెట్‌లో 100 క్యాచ్‌లు పట్టిన ఆరో ఇడియన్ ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు.

టీమిండియా వన్డే క్రికెట్‌లో క్యాచెస్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన వారిలో  విరాట్ కోహ్లీ 164 క్యాచెస్ అందుకొని  మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత మహ్మద్ అజారుద్ధీన్ 156 క్యాచ్‌లో రెండో స్థానంలో ఉన్నారు

తర్వాత  సచిన్ టెండూల్కర్ 140 క్యాచ్‌లు,  రాహుల్ ద్రవిడ్ 124, సురేశ్ రైనా 102 ఉండగా, ఇప్పుడు రోహిత్ శర్మ 100 క్యాచ్‌లతో ఈ జాబితాలో చేరారు.

ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 33వ శతకంతో మరో అద్భుతమైన మైలురాయి కూడా సాధించాడు.

ఇది హిట్ మ్యాన్  కెరీర్‌లోనే బెస్ట్ మూమెంట్ అని చెప్పవచ్చును. ఇక చాలా రోజుల నుంచి ఈయన రిటైర్మెంట్ ఇస్తాడంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఇటు క్యాచెస్, అటు పరుగులతో సెంచరీ రికార్డ్ క్రియేట్ చేశారు

అటు ఆసిస్‌తో వన్డేలో 2500 పరుగులకు పైగా సాధించిన రెండో భారత ఆటగాడిగాను రోహిత్ శర్మ రికార్డ్ క్రియటే చేశారు. ఇప్పటి వరకు సచిన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

వన్డే క్రికేట్‌లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి తన సత్తా చాటారు.