చ‌రిత్ర సృష్టించిన విరాట్.. వన్డేల్లో సరికొత్త రికార్డ్

25 October 2025

 Anand T

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. 

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసి శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బ్రేక్‌ చేశారు.

ఈ మ్యాచ్‌తో వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు. 

ఈ ఘనత సాధించడం ద్వారా కోహ్లీ తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ తర్వాత నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ , 

404 వన్డేల్లో 14,234 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్న సంగక్కర, తాజా రికార్డుతో 293వ వన్డేల్లో 14,255 పరుగులు చేసిన రెండో ప్లేస్‌కు చేరిన కోహ్లీ  

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 74 పరుగులు చేసి, భారత్‌కు 9 వికెట్ల విజయాన్ని అందించిన కోహ్లీ 

వన్డేల్లో ఇప్పటవరకు 51 సెంచరీలు చేసిన విరాట్‌ కోహ్లీ