Bullet Train: భక్తులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏపీలోని ఆ ఆధ్యాత్మిక క్షేత్రం మీదగా బుల్లెట్ ట్రైన్..
ఏపీలో పర్యాటకానికి మరింత బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగు ముందుకు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వ తాజాగా హైదరాబాద్-అమరావతి మీదుగా బెంగళూరుకు వెళ్తున్న బుల్లెట్ ట్రైన్ కారీడార్ మార్పులు చేయాలని.. ఈ కారిడార్‌ను పట్టు చీరలకు ఫేమస్ అయిన ధర్మవరం, ఆధ్యాత్మిక క్షేత్రమైన పుట్టపర్తి మీదుగా చేపట్టాలని NHRCLకు సూచించింది.

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్రంలోని ధర్మవరం, అధ్యాత్మక క్షేగ్రతమైన పుట్టపుర్తి మీదుగా పరుగులు పెట్టనునంది. హైదరాబాద్ నుండి అమరావతి మీదుగా బెంగళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ కారీడార్‌ను ఈ రెండు పట్టణాల మీదుగా నిర్మించేలా ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం NHRCLకు సూచించింది. ఈ మేరకు తాజాగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీలో మార్పులు చేయాలని సూచించింది. ఈ మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయాలని కోరింది. ఈమేరకు రైల్వే బోర్డ్ ఛైర్మన్‌కు సైతం ప్రభుత్వం లేఖరాసింది.
ప్రభుత్వ నిర్ణయంతో డబుల్ బెనిఫిట్
NHRCL మొదటి చేపట్టిన ఎలైన్‌మెంట్ ప్రకారం.. బుల్లెట్ ట్రైన్ కారిడార్ అనంతపురం- హిందూపురం మధ్య దుద్దేబండ వద్ద మాత్రమే స్టేషన్ వచ్చేది. కానీ తాజాగా ప్రభుత్వ సూచించిన విధంగా ధర్మవరం, పుట్టపర్తి మీదుగా కారిడార్‌ను నిర్మించి స్టేషన్‌లు ఏర్పాటు చేస్తే రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఎలా అంటే దేశవిదేశాల నుంచి పుట్టపర్తి క్షేత్రానికి వచ్చే భక్తులు.. ఇక్కడి నుంచి ఈజీగా హైదరాబాద్, బెంగళూరుకు చేరుకోవచ్చు.
పుట్టపర్తి సమీపంలో ఇటీవల రక్షణ రంగానికి చెందిన యుద్ధవిమానాల తయారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే మరికొన్ని అనుబంధ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇప్పటికే సమీపంలో ఉన్న ‘కియా’ పరిశ్రమ వల్ల స్థానిక వ్యాపార రంగానికి మరింత ఊతం లభిస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో రాబోయే బుల్లెట్ రైల్ సౌకర్యంతో పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల ప్రజల ప్రయాణ అవసరాలు తీరడమే కాకుండా, ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
