హీరోహీరోయిన్లు లేకుండానే రూ.100 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్..

Rajitha Chanti

Pic credit - Instagram

10 August 2026

ఇటీవలి కాలంలో భారతీయ చిత్రసీమలో భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, కమర్షియల్ హంగులు ఉన్న చిత్రాలే రూ. 100 కోట్లు వసూలు చేస్తాయనే నమ్మకం బలంగా ఉండేది.

కానీ, ఎటువంటి స్టార్ డమ్ లేకుండా కేవలం బలమైన కథ, ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన చిత్రం ఇది.

మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు 'మంజుమ్మల్ బాయ్స్'. మలయాళంలో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో ఏ అగ్ర కథానాయకుడు లేదా స్టార్ హీరోయిన్ నటించలేదు.

ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ కానీ, మాస్ మసాలా పాటలు కానీ లేవు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ వంటి నటులతో దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని రూపొందించారు.

సుమారు రూ. 20 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, విడుదలైన కొద్దిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 చివరికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

2006లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. లోయలో పడిపోయిన తమ స్నేహితుడిని రక్షించడానికి మిగిలిన మిత్రులు చేసే పోరాటమే ఈ చిత్ర కథ.

కేవలం కేరళలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.