ఒక కప్పు కాఫీ.. ఆ క్యాన్సర్‌ను మాయం చేస్తోందని తెలుసా?

Samatha

10 August 2026

కాఫీ అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిందంటే చాలు కప్పు కాఫీ తాగుతుంటారు.

కానీ కొంత మందికి కాఫీ తాగడం అస్సలే ఇష్టం ఉండదు. కానీ ప్రతి రోజూ స్త్రీలు ఒక కప్పు కాఫీ తాగడం వలన క్యాన్సర్ నుంచి బయటపడవచ్చునంట.

కాఫీ క్యాన్సర్‌ను తగ్గించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమై సమాచారం.  కాఫీ తాగడం వలన రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందంట.

ఈ మధ్య కాలంలో చాలా మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 694,000 మంది మహిళలు రొమ్ముక్యాన్సర్‌తో మరణించడం జరుగుతుందంట.

అయితే దీనిని నుంచి బయటపడాలి అంటే తీసుకునే ఆహారం, జీవనశైలి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, వంటివి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన దాని ప్రకారం..

యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు ప్రసిద్ధి చెందిన పాలీఫెనాల్ అనే సహజ మొక్కల సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుందంట. దీనిని తీసుకోవడం వలన చాలా మంది ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంట.

అయితే ఈ సమ్మేళనం ఎక్కువగా కాఫీలో ఉంటుందంట. అంతే కాకుండా కోకూ, బెర్రీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, చిక్కుళ్ల వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాఫీలో పుష్కలంగా ఉంటుందంట.