ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?

Samatha

15 July 2026

ఆషాఢ మాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. ఈ సమయంలో ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటారు.

ఆషాఢ మాసం

హిందూ సంప్రదాయంలో మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారం. ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఆడపిల్లలు చేతికి గోరింటాకు పెట్టుకుంటారు.

హిందూ సంప్రదాయం

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒక వేళ సమయంలో దీనిని పెట్టుకోకపోతే అనేక ప్రయోజనాలు కోల్పోతారంట.

ఆరోగ్య ప్రయోజనాలు

గోరింటాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ముఖ్యంగా చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది.

చర్మ సమస్యలు

వర్షాకాలం మొదలైనా, ఎండ వేడి వంటి సమస్యల వలన ఒంట్లో వేడి వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది శరీరానికి చలువ చేస్తుందంట.

వేడి సమస్యలు

అలాగే ఈ సమయంలో పెళ్లికాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడం వలన, అది ఎంత బాగా పండుతే, అంత మంచి భర్త వస్తాడని అంటారు.

మంచి భర్త రావడం

అంతే కాకుండా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి వచ్చి, తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని, తమ సౌభాగ్యాన్ని చూసి మెరిసిపోతుంటారు.

సౌభాగ్యం

ఒక వేళ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోకపోతే, ఇవన్నీ మిస్ అయినట్లే అని చెబుతున్నారు పండితులు, నిపుణులు.

మిస్ అయినట్లే