ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!

Samatha

29 June 2026

తులసి మొక్కను లక్ష్మీస్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో తులసి మొక్కను తప్పనిసరిగా నాటుకుంటారు.

తులసి

ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉండటం అనేది కామన్. ప్రతి రోజూ ఉదయం, స్నానం ఆచరించిన తర్వాత తులసి పూజ చేస్తుంటారు.

తులసి మొక్క

అయితే ఇంటిలో తులసి మొక్క ఉన్న సమయంలో, తప్పకుండా దాని విషయంలో కొన్ని పొరపాట్లు చేయకూడదు అంటున్నారు నిపుణులు.

చేయకూడని పొరపాట్లు

ఎప్పుడూ కూడా తులసి మొక్కకు ఎక్కువగా నీరు పోయడం లేదా ఆదివారం నీరు పోయడం చేయకూడదంట.

ఆదివారం నీరు పోయడం

ఆదివారం మొక్కను తాకినా, నీరు పోసినా, ఆకులు కోసినా అది మీ ఇంటిలో అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

ఆదివారం మొక్కను తాకడం

అదే విధంగా, కొంత మంది తమ చేతి  గోర్లతో తులసి ఆకులను తుంచుతుంటారు. ఇలా చేయడం మహాపాపం అంటున్నారు నిపుణులు.

గోర్లతో ఆకులు తుంచడం

దీనివలన ఇంటిలో ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందువలన గోర్లతో ఆకులు తుంచకూడదు.

ఆర్థిక సమస్యలు

అంతే కాకుండా ససాయంత్రం వేళలో ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులు తుంచకూడదంట. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవ చేస్తుందంట.

సాయంత్రం సమయం