స్వీట్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ స్వీట్‌ను చాలా ఇష్టంగా తింటుంటారు.
అయితే స్వీట్ మంచిదే కానీ అతిగా తీసుకోవడం అంత మంచిది కాదు అంటారు. అందుకే కొంత మంది దీనిని చాలా వరకు మితంగా మాత్రమే తీసుకుంటారు.
కానీ కొందరు మాత్రం పదే పదే అతిగా స్వీట్ తీసుకుంటారు. కారణాలు అడిగితే.. నాకు పదే పదే స్వీట్ తినాలనిపిస్తుంది అంటారు. కాగా, మనం దీనికి గల కారణాలు తెలుసుకుందాం.
పదే పదే స్వీట్ తినాలనిపించడానికి అనేక కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా శరీరంలో పోషకాహార లోపం, హర్మోన్ల మార్పులు, ఒత్తిడి దీనికి ప్రధాన కారణం.
అంతే కాకుండా మెగ్నీషియం లోపం అధికంగా ఉన్నవారిలో కూడా పదే పదే తీపి తినాలనే కోరిక ఎక్కువగా పుడుతుందంట. అంతే కాకుండా కొన్ని విటమిన్స్ తగ్గడం కూడా కారణం కావచ్చు.
ఇదే కాకుండా మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురి అయినప్పుడు కూడా మీకు ఆకలికి బదులు స్వీట్ తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే ఎక్కువగా ఆహారం తీసుకోకపోవడం, విటమిన్స్ లోపం, పోషకాల లోపం, అతి టెన్షన్, ఒత్తిడి వంటి వాటి వలన కూడా మీ శరీరం స్వీట్ తినాలనే కోరికను కలిగిస్తుందంట.
ఇదే కాకుండా కొంత మందికి స్వీట్ తినడం అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటులో భాగంగా కూడా తీపి తినాలనే కోరిక కలుగుతుందంట.