రంగు రంగుల మందారాలు.. ఇంటి ముందు ఏ రంగు మొక్క ఉండాలో తెలుసా?

Samatha

31 July 2026

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఇంటి ముందు అందమైన పూల మొక్కలు నాటుకుంటారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మొక్కలను ఇంటిలో నాటుకొని, పూలు పూస్తే మురిసిపోతారు.

కొంత మంది గులాబీ, మల్లె వంటి పూల చెట్లను ఎక్కువగా నాటితే, చాలా మంది మందార మొక్కను ఎక్కువగా నాటుకుంటారు. ఎందుకంటే ఈ పూలు పూజకు ఎక్కువగా పనికి వస్తాయి.

అందువలన రంగు రంగుల మందార మొక్కలను ఇంటి అలంకరణ కోసం, పూజ కోసం ఇంటి ముందు నాటుకోవడం అనే చాలా వరకు సహజం.

అయితే వాస్తు ప్రకారం, ఇంటి ముందు అన్నింటిలో కెళ్లా ఈ రంగు మందార మొక్క ఉండటం చాలా శుభప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా, ఇంతకీ ఆ మొక్క ఏదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఇంటి ముందు ఎరుపు రంగు మందార మొక్క ఉండటం చాలా శుభప్రదం. ఇది ఇంటిలో సానుకూలతను పెంపొందించడమే కాకుండా, అన్ని విధాలుగా కూడా శుభఫలితాలు అందేలా చేస్తుందంట.

మరీ ముఖ్యంగా ఎరుపు రంగు మందార లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందువలన ఈ మొక్క ఇంటి ముందు ఉండటం వలన సంపద కూడా పెరుగుతుందంట.

అమ్మవారికి, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన మొక్క ఇది కాబట్టి. ఇది ఇంటి ముందు ఉండటం వలన. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి