మీ ఇంటిలో నెమలి ఈకలు ఉన్నాయా.. ఈ తప్పు చేస్తే అప్పుల పాలే

Samatha

31 July 2026

ఇంటిలో నెమలి ఈకలు ఉండటం కామన్.  ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో నెమలి ఈకలు అనేవి తప్పనిసరిగా ఉంటున్నాయి.

అయితే కొంత మంది నెమలి ఈకల విషయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ, ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటారు.

కాగా, ఇప్పుడు మనం నెమలి ఈకల విషయంలో చేయకూడని తప్పులు ఏంటివి? ఏ తప్పులు చేస్తే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయో చూద్దాం.

వర్షాకాలంలో  నెమలి ఈకలను మురికి, దుమ్ము పట్టిన చోట నెమలి ఈకలను పెట్టకూడదు. దీని వలన లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది.

అదే విధంగా నేలపై, చెత్త ఉండే చోట , బాత్రూమ్ దగ్గర నెమలి ఈకలను పెట్టడం వలన ఇంటిలో సానుకూలత తగ్గిపోతుంది.

అలాగే ఎప్పుడూ కూడా ఇంటిలో విరిగిన, చెరిగిన ఈకలు ఉండకూడదు. ఇలాంటివి ఇంటిలో ఉండటం వలన అప్పుల బాధలు పెరిగిపోతాయి.

అలాగే కొంత మంది నెమలి ఈకలను బెడ్ రూమ్‌లో పెట్టుకుంటారు. కానీ ఇలా బెడ్ రూమ్‌లో నెమలి ఈకలు పెట్టడం అస్సలే మంచిది కాదంట.

ఇక కొంత మంది దొంగిలించిన నెమలి ఈకలను ఇంటిలో పెట్టుకుంటారు. ఇది చాలా అశుభకరం, ఆర్థిక సమస్యలు పెరిగేలా చేస్తుందంట.