Weather Alert: మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగస్టు 12 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో, ఆగస్టు 12, 2026 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర భారతదేశ ద్వీపకల్పము మీదుగా సుమారుగా 22° ఉత్తర అక్షాంశం వెంబడి ఒక షియర్ జోన్ సగటు సముద్ర మట్టానికి 3.1 మరియు 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం (11-08-2026) విజయనగరం, మన్యం, అల్లూరి,పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ,శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం;-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ ;-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ సూచన (FORECAST):
మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
