AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్.. ఎక్కడెక్కడంటే?

తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల పరిరక్షణకు గాను హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉంది.

మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్.. ఎక్కడెక్కడంటే?
Wines, Bars Closed
Balaraju Goud
|

Updated on: Sep 23, 2026 | 8:28 AM

Share

తెలంగాణలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. గణేశ్ నిమజ్జనం ప్రారంభమయ్యే బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. నిమజ్జన శోభాయాత్రల సమయంలో మద్యం సేవించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలోనూ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం. రమేష్‌ ఆదేశాల మేరకు ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూసివేయాల్సి ఉంటుంది.

అయితే స్టార్‌ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us