AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముద్రాలోన్ పేరుతో కుచ్చుటోపీ.. వ్యాపారవేత్త నుంచి 4.5లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు జనాలను బోల్తా కొట్టించేందుకు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరి పీఎస్‌ పరిదిలో వెలుగు చూసింది. ముద్రాలోన్ ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.11.50లక్షలు కాజేశారు కేటుగాళ్లు.

Hyderabad: ముద్రాలోన్ పేరుతో కుచ్చుటోపీ.. వ్యాపారవేత్త నుంచి 4.5లక్షలు కాజేసిన కేటుగాళ్లు
Beware Of Social Media Loan Ads
Anand T
|

Updated on: Nov 17, 2026 | 8:07 PM

Share

సైబర్ మోసాలపై పోలీసులు ఎన్ని హెచ్చిరికలు జారీ చేస్తున్నా.. జనాలు మాత్రం జాగ్రత్త పడడం లేదు.. సైబర్ నేరగాళ్లు విసిరే వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ముద్రాలో లోన్స్‌ ఇప్పిస్తామని చెప్పి జనాలను బురిడీ కొట్టిస్తున్న నలుగు కేటుగాళ్లను మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రాకం.. బాధితుడు ఫేస్‌బుక్‌లో ముద్రా లోన్ ఇస్తామంటూ వచ్చిన ఒక ప్రకటనను చూసి వివరాలు నమోదు చేశారు. ఆ కోద్ది సేపటికే అతని ఒక కాల్ వచ్చింది. తాము ముద్రా ఫైనాన్స్ ప్రతినిధులమంటూ సైబర్ నేరగాళ్లు బాధితుడికి ఫోన్ చేశారు. రూ. 11.50 లక్షల లోన్ మంజూరు చేస్తామని నమ్మబలికి, ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్ , ఆర్బీఐ ఫీజుల పేరుతో విడతలవారీగా బాధితుడి నుంచి సుమారు రూ.4,67,800 తీసుకున్నారు. అయితే తర్వాత ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఇక బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించిన మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచే ఇదే తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ముఖ్యంగా తెలుగు మాట్లాడే ముద్రా లోన్ దరఖాస్తుదారులనే టార్గెట్‌గా చేసుకుని ఈ నేరాలకు పాల్పడుతున్నారు తెలుసుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు రెండు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనతో జనాలకు మరోసారి పోలీసులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లోన్ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక బ్యాంకులను మాత్రమే సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us