AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Retained Players: ముచ్చటగా మూడోసారి ట్రోఫీ కోసం.. పవర్ ఫుల్ టీంతో బరిలోకి ఆర్సీబీ..!

RCB Retained and Released Players: ఐపీఎల్ 2027 రిటెన్షన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు మాజీ భారత క్రికెటర్ అభినవ్ ముకుంద్ కీలక సూచన చేశాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ను జట్టు నుంచి విడుదల చేయొద్దని అభిప్రాయపడ్డాడు. టోర్నీ మొత్తం అందుబాటులో లేకపోయినా.. బంతితో అతడు చూపించే ప్రభావం ఎంతో విలువైనదని పేర్కొన్నాడు.

RCB Retained Players: ముచ్చటగా మూడోసారి ట్రోఫీ కోసం.. పవర్ ఫుల్ టీంతో బరిలోకి ఆర్సీబీ..!
Rcb Retained Players
Venkata Chari
|

Updated on: Nov 17, 2026 | 7:35 PM

Share

RCB Retained and Released Players: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టు తమ విడుదల జాబితాను సిద్ధం చేసింది. రెండుసార్లు వరుసగా ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. వచ్చే సీజన్‌లోనూ టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ (Jacob Bethell), భారత యువ పేసర్ మాంగేశ్ యాదవ్ (Mangesh Yadav) సహా ఐదుగురికి వీడ్కోలు పలికింది.

జాకబ్ బెథెల్‌కు షాక్!

ఇంగ్లండ్‌కు చెందిన ప్రతిభావంతమైన బ్యాటర్ జాకబ్ బెథెల్‌ను విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2026లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే అతడి నిర్ణయం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే వచ్చే సీజన్‌కు ముందు ఆర్సీబీ అతడిని కొనసాగించకూడదని నిర్ణయించినట్లు సమాచారం. బెథెల్ ధర రూ.2.6 కోట్లు.

రూ.5.2 కోట్ల మాంగేశ్ యాదవ్ కూడా ఔట్!

ఆర్సీబీ విడుదల జాబితాలో మరో కీలక పేరు మాంగేశ్ యాదవ్. గత వేలంలో ఈ అన్‌క్యాప్డ్ భారత పేసర్‌ను బెంగళూరు రూ.5.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే వచ్చే సీజన్ కోసం అతడిని విడుదల చేయాలని నిర్ణయించింది. భారీ ధర పలికిన యువ బౌలర్‌ను వదులుకోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

విహాన్ మల్హోత్రాకు కూడా వీడ్కోలు!

భారత అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra)ను కూడా ఆర్సీబీ విడుదల చేసింది. అతడితో పాటు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ గ్లీసన్ (Richard Gleeson), సాత్విక్ దేశ్వాల్ (Satvik Deswal) కూడా విడుదలైన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.

RCB విడుదల చేసిన ఐదుగురు ఆటగాళ్లు వీరే!

క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసిన ఆటగాళ్లు, వారి ధరలు ఇలా ఉన్నాయి.

మాంగేశ్ యాదవ్ – రూ.5.2 కోట్లు

జాకబ్ బెథెల్ – రూ.2.6 కోట్లు

రిచర్డ్ గ్లీసన్ – రూ.1.6 కోట్లు

సాత్విక్ దేశ్వాల్ – రూ.30 లక్షలు

విహాన్ మల్హోత్రా – రూ.30 లక్షలు

ఆర్సీబీ దగ్గర రూ.14.15 కోట్ల పర్స్!

ఈ ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత ఆర్సీబీ వద్ద రూ.14.15 కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వచ్చే వేలంలో మొత్తం ఐదు ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ఒక విదేశీ ఆటగాడి స్థానం కూడా ఉంది.

టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బెంగళూరు!

వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే సీజన్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. అందుకోసం జట్టులో అవసరమైన మార్పులు చేస్తోంది. ఐదుగురు ఆటగాళ్లను విడుదల చేసిన ఆర్సీబీ.. మినీ వేలంలో ఎవరిని తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విదేశీ ఆటగాడి స్థానాన్ని ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.

Follow Us