రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం చాలా నాటకీయంగా సాగింది. IPL ప్రారంభ ఎడిషన్‌లో అంటే 2008లో 7వ స్థానంలో నిలిచింది. 2009లో బలమైన ప్రదర్శన కారణంగా రెండవ స్థానంలో నిలిచింది. అయితే, 2010లో మంచి ప్రదర్శన కనబరిచి మూడో స్థానంలో నిలిచింది.
2011లో RCB ఫైనల్‌కు చేరుకుంది. కానీ, గెలవలేక రెండో స్థానంలో నిలిచింది. 2012లో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తరువాతి సంవత్సరంలో బెంగళూరు ప్రదర్శన పూర్తిగా పాడైంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని జట్టు పాయింట్ల పట్టికలో చివరిగా అంటే ఎనిమిదో స్థానంలో నిలిచింది.
2014లో కూడా RCB స్థానం మెరుగుపడకపోవడంతో ఏడో స్థానంలో కొనసాగింది. 2015లో కోహ్లి నేతృత్వంలోని RCB తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచింది. 2016లో కోహ్లీ సేన టైటిల్‌ను కోల్పోయి రెండో స్థానంలో నిలిచింది. 2017లో మరోసారి RCB ప్రదర్శన నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2018 , 2019లో కూడా ఈ జట్టు తొలి టైటిల్‌కు దూరంగా ఉంది. వరుసగా ఆరో, అత్యల్ప స్థానంలో ఉన్న విరాట్ సేన 2020లో కూడా నిరాశపరిచింది. ఆరంభం బాగానే ఉన్నా ఆ జట్టు నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది.
2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే మరోసారి టైటిల్‌కు దూరంగా ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది.
2022లో కొత్త కెప్టెన్ డుప్లెసిస్ సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే, ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించిన తర్వాత రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించలేకపోయింది. ఇక 2023లోనూ ఆ జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. 6వ స్థానంలో నిలిచింది.