కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడప-చెన్నై జాతీయ రహదారిపై లారీ ఆటోను ఢీకొట్టడంతో రేణింతల గ్రామానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.