AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా

టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా

Phani CH
|

Updated on: Mar 01, 2026 | 10:02 PM

Share

దక్షిణ భారత సినీ పరిశ్రమలో సరిహద్దులు చెరిగి, క్రాస్-ఇండస్ట్రీ సహకారాలు పెరిగాయి. అల్లు అర్జున్-అట్లీ వంటి పాన్-ఇండియా కాంబోలు మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. రెమ్యునరేషన్లు, బడ్జెట్లు భారీగా పెరగడానికి ఇది ఒక కారణం. మన దర్శకులు ఇతర హీరోలతో పనిచేస్తుండగా, కొత్త ధోరణులు బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది.

సౌత్ ఇండస్ట్రీలో బోర్డర్స్ అన్నీ చెరిగిపోయాయిప్పుడు. మన హీరోకి పక్కా లోకల్ డైరెక్టర్ కావాలన్న రూలేం లేదు.. అలాగే పక్క భాషా దర్శకుడికి వాళ్ళ హీరోనే కావాలన్న కండిషన్ లేదు. అన్నీ క్రాస్ కాంబినేషన్సే..! ఇదంతా కేవలం మార్కెట్ పెంచుకోవడానికా లేక రెమ్యునరేషన్ల గేమ్ ప్లానా..? పక్క ఇండస్ట్రీ వాళ్ళని చూసి మనోళ్ళు బడ్జెట్లు ఎలా పెంచేస్తున్నారు..? చూద్దామా ఓసారి.. అల్లు అర్జున్‌తో అట్లీ.. సూర్యతో వెంకీ అట్లూరి.. విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్.. ఇలా ఎక్కడ చూసినా మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలోనూ రామ్ చరణ్, శంకర్.. రామ్, లింగుసామి కాంబోస్ అలరించాయి. వాళ్లు మనోళ్లకు హిట్లు ఇవ్వకపోయినా.. విజయ్‌కు వంశీ పైడిపల్లి వారసుడు ఇవ్వగా.. ధనుష్‌తో సార్, దుల్కర్‌తో లక్కీ భాస్కర్ లాంటి హిట్స్ ఇచ్చారు వెంకీ అట్లూరి. మన హీరోల బిజీ వల్లే మన దర్శకులు తమిళ హీరోల వైపు వెళ్తున్నారు. ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను అడ్డం పెట్టుకుని మార్కెట్ లెక్కలు చూపిస్తూ అల్లు అర్జున్ సినిమాకు అట్లీ, సూర్య సినిమాకు వెంకీ అట్లూరి భారీగానే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారని టాక్. ఈ కాంబోస్ వల్ల రెండు ఇండస్ట్రీల మార్కెట్ కలిసొస్తుంది కాబట్టే డిమాండ్ మరింత పెరుగుతుంది.మల్టీలాంగ్వేజ్ అంటే ఓకే కానీ.. తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ కలిసి చేసే సినిమాలకి కూడా పాన్ ఇండియా రేంజ్‌ పారితోషికాలు డిమాండ్ చేస్తుండటంతో బడ్జెట్ లెక్కలు వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నపలంగా బడ్జెట్ పెరగడం వెనక కారణం కూడా ఇదే. సెట్స్‌పై ఉన్న తెలుగు, తమిళం కాంబినేషన్స్ హిట్టైతే ఫ్యూచర్‌లో ఈ తరహా సినిమాలు మరిన్ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు

Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్

AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

Follow Us