Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?
విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ నిరీక్షిస్తుండగా, VFX నాణ్యతపై మేకర్స్ దృష్టి సారించారు. ట్రోలింగ్ భయంతో చిత్ర నిర్మాతలు, దర్శకుడు వశిష్ట విజువల్ ఎఫెక్ట్స్‌ను మెరుగుపరచడానికి సమయం తీసుకుంటున్నారు. చిరంజీవి సూచనలతో టాప్ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. తొలి టీజర్‌పై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించి, విజువల్ వండర్‌ను అందించాలనే లక్ష్యంతో 2026లో సినిమా విడుదల కానుంది.
విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి అప్‌డేట్స్ మాత్రం ఏమీ రావట్లేదు. ట్రోలింగ్ భయంతోనే విశ్వంభర లేట్ అవుతుందా..? అసలు విజువల్ ఎఫెక్ట్స్ అప్‌డేట్ ఏంటి..? మెగా మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది..? ఔట్ పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు..? ఈ ఏడాదైనా సినిమా వస్తుందా..? కొన్నాళ్లుగా పూర్తిగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఫోకస్ పెట్టారు దర్శకుడు వశిష్ట. రీసెంట్‌గా గ్రాఫిక్స్‌తో వచ్చిన ఔట్ పుట్ చూసి మేకర్స్ హ్యాపీ అవ్వగా.. చిరంజీవి సైతం ఓకే అన్నారని తెలుస్తుంది. మరింత బెటర్ ఔట్ పుట్ కోసం చిరు కొన్ని చిన్నచిన్న మార్పులు సజెస్ట్ చేయడంతో.. ఇండియాలోని టాప్ VFX కంపెనీలు ఆ వర్క్‌లోనే బిజీగా ఉన్నాయి. ఈ రోజుల్లో విజువల్ బేస్డ్ సినిమా వస్తుందంటే చాలు.. ట్రోలింగ్ కోసం భూతద్దాలు పట్టుకుని మరీ రెడీగా ఉంటున్నారు. అందుకే విశ్వంభరపై ఫోకస్ పెంచి.. చిన్న పొరపాటు కూడా జరక్కుండా విజువల్ వండర్‌ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఇంత టైమ్ తీసుకుని మరీ వర్క్ చేస్తున్నారు. గతంలో ఆదిపురుష్, రీసెంట్‌గా రాజా సాబ్ లాంటి సినిమాలకే ట్రోలింగ్ సెగ తప్పలేదు. విశ్వంభర ఫస్ట్ టీజర్ వచ్చినపుడు విజువల్స్ విషయంలో నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో.. మేకర్స్ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఆ ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీని పెంచి సెకండ్ టీజర్ మరింత అద్భుతంగా డెవలప్ చేశారు. ఏదేమైనా మళ్ళీ ఎలాంటి ట్రోల్స్ బారిన పడకుండా.. పర్ఫెక్ట్ ఔట్ పుట్ కోసం కష్టపడుతున్నారు. 2026లోనే విశ్వంభర విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్
9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు
బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

