AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కోటికి పైగా బీపీ, షుగర్ కేసులు.. 3 జిల్లాల్లో పరిస్థితి దారుణం

ఏపీలో కోటికి పైగా బీపీ, షుగర్ కేసులు.. 3 జిల్లాల్లో పరిస్థితి దారుణం

Phani CH
|

Updated on: Nov 23, 2026 | 7:12 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో NCD 4.0 సర్వే ప్రకారం కోటికి పైగా బీపీ, షుగర్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 59.63 లక్షల మందికి హైబీపీ, 48.95 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో అత్యధిక కొత్త కేసులు నమోదయ్యాయి. వయసుతో పాటు వ్యాధుల ముప్పు పెరుగుతోందని సర్వే హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి వ్యాధులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని NCD 4.0 సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 59.63 లక్షల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, 48.95 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు వ్యాధులకు కలిపి మొత్తం 1 కోటి 8 లక్షల 58 వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో 34 లక్షల మందికి బీపీ, షుగర్ రెండూ ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ సర్వేలో విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో కొత్త కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధుల ముప్పు పెరుగుతోందని, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో అధిక రక్తపోటు కేసులు 47.60 శాతం, మధుమేహం కేసులు 43.39 శాతం ఉన్నాయని నివేదిక తెలిపింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అంశాలు ఈ వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి అవశ్యకతను ఈ సర్వే నొక్కిచెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI: ఏఐతో పెరగనున్న నిరుద్యోగం ..? ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కా

గుండె డాక్టర్ అరుదైన రికార్డ్…

బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసుకు నెటిజన్లు ఫిదా

పురుషుల డైట్ సీక్రెట్! 20, 40, 60 – ఏ వయసులో ఏం తినాలో తెలుసా?

NEFT ద్వారా రోజులో ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు?..ఆర్బీఐ రూల్స్‌ ఇవే

Follow Us