దుబాయ్లో నివాసం ఉంటున్న నటుడు మంచు విష్ణు కుటుంబం మిసైల్ దాడుల తీవ్రతకు గురైంది. దాడుల వల్ల వారి ఇల్లు వణికిందని, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారని విష్ణు తెలిపారు. యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, శాంతియుత ప్రపంచం కోసం ప్రార్థించాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో అందరికీ బలం కలగాలని ఆకాంక్షించారు.