AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit Movie: ‘స్పిరిట్’లో డాన్ లీ ఉన్నాడా? లేడా? ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు ఒకటే పేరును జపిస్తున్నారు.. అదే 'స్పిరిట్'. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Spirit Movie: ‘స్పిరిట్’లో డాన్ లీ ఉన్నాడా? లేడా? ప్రభాస్ ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!
Prabhas And Lee
Nikhil
|

Updated on: Mar 01, 2026 | 10:26 PM

Share

ఒకవైపు సినిమా అప్డేట్స్ వస్తున్నా, మరోవైపు ఒక విదేశీ నటుడి గురించి సాగుతున్న ప్రచారం ఇప్పుడు చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది. ఆయన ఒక గ్లోబల్ స్టార్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెడితే అది ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. ఆయనతో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ జతకడితే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘స్పిరిట్’ మొదలైనప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఒక విదేశీ నటుడి పేరు విపరీతంగా వినిపిస్తోంది. కొరియన్ యాక్షన్ స్టార్ ఆ సినిమాలో ఉన్నాడని, ప్రభాస్ తో ఫైట్ చేయబోతున్నాడని లీకులు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా విడుదలైన ఒక అప్డేట్ చూసిన తర్వాత అభిమానులు కొంత నిరాశకు లోనవుతున్నారు.

వివేక్ ఒబేరాయ్ లుక్..

ఇటీవలే చిత్ర బృందం వివేక్ ఒబేరాయ్ లుక్ విడుదల చేసింది. సాధారణంగా ఇదొక క్రేజీ న్యూస్ అవ్వాలి, కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ‘జస్ట్ ఓకే’ అనేశారు. దీనికి ప్రధాన కారణం.. వారు ఆశించింది కొరియన్ నటుడు డాన్ లీని. గతంలో ‘యానిమల్’ కోసం బాబీ డియోల్ లాంటి సర్ప్రైజ్ విలన్ ని తీసుకొచ్చి షాక్ ఇచ్చిన సందీప్ వంగా, ఈసారి కూడా అలాంటి ప్రయోగమే చేస్తారని అందరూ భావించారు. వివేక్ మనకు కొత్త కాదు, ఇప్పటికే ‘రక్త చరిత్ర’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో ఆయన విలనిజాన్ని చూసేశాం. అందుకే ఆయన ఎంట్రీ అంతగా సెన్సేషన్ కాలేకపోయింది.

సినిమా మొదలుకాక ముందు నుంచే డాన్ లీ ఈ ప్రాజెక్టులో ఉన్నాడనే వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది. దీనిపై సందీప్ రెడ్డి వంగాను ఇంటర్వ్యూలలో అడిగినా ఆయన స్మార్ట్ గా తప్పించుకున్నాడు. ఒకవేళ డాన్ లీ లేకపోయినా అదేదో ముందుగా క్లారిటీ ఇస్తేనే సినిమాకు మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియా అంతా ఒక విదేశీ నటుడి కోసం ఎదురుచూడటం వల్ల, సినిమాలోని ఇతర ముఖ్యాంశాలు మరుగునపడిపోయే ప్రమాదం ఉంది. ఈ పుకార్లకు త్వరగా చెక్ పెడితేనే ‘స్పిరిట్’ పక్కాగా హైలైట్ అవుతుంది.

ప్రభాస్ బిజీ షెడ్యూల్..

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘కల్కి 2’ సెట్స్‌లోకి అడుగు పెట్టాలి. సాధారణంగా ఒక సినిమా చేస్తున్నప్పుడు వేరే ప్రాజెక్టుల జోలికి వెళ్లకూడదని ప్రభాస్ భావిస్తారు, కానీ డెడ్ లైన్స్, బిజీ షెడ్యూల్స్ వల్ల ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పలు సినిమాలను బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది. ‘స్పిరిట్’ షూటింగ్ సమయానికి ఆయన పూర్తి డేట్స్ ఇవ్వగలుగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగా మార్కు యాక్షన్ కు ప్రభాస్ తోడైతే బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం. కానీ అభిమానులు ఆశించినట్లుగా డాన్ లీ ఇందులో కనిపిస్తాడా లేక వివేక్ ఒబేరాయ్ తోనే సరిపెట్టుకోవాలా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర