మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ 40 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లాకు తిరిగి వచ్చారు. లొంగిపోయిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన ఆయనకు బంధుమిత్రులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వేణుగోపాల్, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ సామాన్య జీవనం గడపాలని ఆకాంక్షించారు.