Sujeeth: యూనివర్స్ బిల్డ్ చేస్తున్న సుజిత్.. ప్రభాస్, పవన్, నానితో భారీ ప్రణాళికలు
టాలీవుడ్‌లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ మొదలైంది. డైరెక్టర్ సుజిత్ తన గత చిత్రాలైన సాహో, ఓజీలతో పాటు రాబోయే ప్రాజెక్టుల హీరోలు ప్రభాస్, పవన్ కళ్యాణ్, నానిలతో ఒక భారీ యూనివర్స్‌ను నిర్మిస్తున్నట్లు బలమైన సూచనలిచ్చారు. ఓజీలో సాహో రిఫరెన్స్‌లు, "ఇది ఆరంభం మాత్రమే" అన్న సుజిత్ వ్యాఖ్య, తాజాగా ప్రభాస్, పవన్, నానిలతో కూడిన "మై గ్యాంగ్స్టర్ ట్రియో" పోస్టర్ ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది.
ప్రెసెంట్ అన్ని సినీ పరిశ్రమల్లో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. ఈ జాబితాలోకి టాలీవుడ్ కూడా చేరనుందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సుజిత్ ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మించే పనిలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పలు హింట్స్‌ను అందించిన సుజిత్, తాజాగా మరో అప్డేట్‌తో అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. యంగ్ డైరెక్టర్ సుజిత్, తన రెండో చిత్రం సాహోలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో పనిచేశారు. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, పవన్ అభిమానుల ఆకలిని తీర్చారు. ఓజీ సినిమాలో సాహో రిఫరెన్స్‌లు ఉండటంతో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్ మొదలైంది. ఓజీ రిలీజ్‌కి ముందు సుజిత్ చేసిన “గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. అన్నీ సరిగ్గా కుదిరితే ఈ ప్రపంచం మరింత పెద్దది కాబోతోంది” అనే వ్యాఖ్య ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్
టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా
Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

