AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI T20 WC Result: చితక్కొట్టిన శాంసన్.. విండీస్‌పై ఉత్కంఠ విజయంతో సెమీస్‌కు భారత్

India vs West Indies Result, T20 World Cup 2026: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు విండీస్ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో భారత జట్టు సెమీస్ చేరుకుంది. సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టుతో మార్చి 5న వాంఖడే స్టేడియంలో ఆడనుంది. ఇక తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుతో సౌతాఫ్రికా టీం ఆడనుంది.

IND vs WI T20 WC Result: చితక్కొట్టిన శాంసన్.. విండీస్‌పై ఉత్కంఠ విజయంతో సెమీస్‌కు భారత్
Ind Vs Wi Result
Venkata Chari
|

Updated on: Mar 01, 2026 | 10:57 PM

Share

India vs West Indies Result, T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. చివరి సూపర్ 8 మ్యాచ్‌లో, సూర్య సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (40), జాసన్ హోల్డర్ (37 నాటౌట్) కీలక పాత్ర పోషించగా, జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.

196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆరంభం పేలవంగానే ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ 10 పరుగులు చేసి అవుటయ్యారు. తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు జోడించారు.

అయితే, సంజు సామ్సన్ ఒక ఎండ్‌లో దృఢంగా నిలిచాడు, 50 బంతుల్లో నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో సహా అజేయంగా 97 పరుగులు చేశాడు.

చివరి 5 ఓవర్లలో వెస్టిండీస్ 70 పరుగులు..

ఒకానొక సమయంలో కరేబియన్ జట్టు స్కోరు 15 ఓవర్లలో 125/4. చివరి 5 ఓవర్లలో జట్టు 70 పరుగులు చేసింది. రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్ 5వ వికెట్‌కు 35 బంతుల్లో అజేయంగా 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ షాయ్ హోప్, రోస్టన్ చేజ్ 53 బంతుల్లో 68 పరుగులు జోడించారు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us