విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్ త్రీలోని ఓ ఇంటి ఆవరణలోకి భారీ నాగుపాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో స్నేక్ క్యాచర్ కిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.