EPFO: నవంబర్ 30 వరకే టైమ్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త. 58 ఏళ్ల తర్వాత మీరు ప్రతీ నెలా పెన్షన్ పొందుతుంటే ఈ నెల 30 తేదీలోపు ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ అందించాలి. పెన్షన్‌దారుడు జీవించే ఉన్నాడని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోయే అవకాశముంటుంది.

ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. 58 ఏళ్ల రిటైర్మెంట్ పీరియడ్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అయిత ఈపీఎస్ కింద పెన్షన్ పొందేవారు లైఫ్ సర్టిఫికేట్ ప్రతీ ఏడాది సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే సులువుగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించి మీ మొబైల్ నుంచే దీనిని సబ్మిట్ చేయవచ్చు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం అందుబాటులో ఉంది.
ఆధార్ నెంబర్, పీపీఓ, పెన్షన్ అకౌంట్ సమాచారం అందించడం ద్వారా ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా జీవిత ధృవీకరణ పత్రం సమర్పించవచ్చు. పెన్షన్ తీసుకునే వ్యక్తి జీవించే ఉన్నాడని నిర్ధారించుకోవడానికి ఈ పత్రం ఉపయోగపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెన్షన్లు పొందేవారు దీనిని తప్పనిసరిగా ప్రతీ ఏడాది సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30వ తేదీ వరకు మాత్రమే దీనిని సబ్‌మిట్ చేసేందుకు కేంద్రం గడువు కల్పించింది. దీంతో ఆలోపు పెన్షనర్లు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనారోగ్యంతో బాధపడేవారు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నవారికోసం ఆన్ లైన్ ద్వారా సబ్‌మిట్ చేసే అవకాశం కేంద్రం కల్పించింది. పీఎఫ్ పెన్షన్‌దారులు ఉమాంగ్ యాప్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలనేది తెలుసుకుందాం.
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం ఎలా..?
-ఉమాంగ్ యాప్ తెరవండి
-అనంతరం సెర్చ్ బార్‌లో లైఫ్ సర్టిఫికేట్ అని టైప్ చేయండి
– ఆధార్ నెంబర్ నమోదు చేయండి
-ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి
– మీ పేరు, పెన్షన్ రకం, సంస్థ పేరు, పెన్షన్ మంజూరు చేసే అధికారి, పంపిణీ చేసే ఏజెన్సీ, పీపీఓ నెంబర్, ఫించన్ ఖాతా నెంబర్ వంటివి నమోదు చేయండి
– ఆ తర్వాత ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా మీ ఫేస్ స్కాన్ చేయండి
– ముఖ ధృవీకరణ తర్వాత మీ జీవిత ధృవీకరణ పత్రం జనరేట్ అవుతుంది
అనంతరం ఎస్‌ఎంఎస్ ద్వారా జీవన్ ప్రమాణ్ ఐడీ అందుతుంది
– ఉమాంగ్ యాప్‌లో వ్యూ సర్టిఫికేట్ ఆప్షన్‌కు వెళ్లి మీ సర్టిఫికేట్‌ను చూసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం వంటివి చేసుకోవచ్చు
-మీరు సమర్పించిన తర్వాత మీ పెన్షన్ పంపిణీ సంస్థకు డిజిటల్‌గా ఇది వెళ్తుంది. దీని వల్ల మీరు ఫిజికల్ సర్టిఫికేట్ అందించాల్సిన పని ఉండదు.
