AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Capital of India: వేల ఎకరాల్లో సాగు.. ఉసిరికాయలు పండించి GI Tag పొందిన నగరం ఏదో తెలుసా?

చలికాలం వచ్చిందంటే మార్కెట్లలో ఉసిరికాయలు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నగా, పచ్చగా ఉండే ఈ పండు పుల్లని రుచితో పాటు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అందుకే చాలామంది ఉసిరికాయలను నేరుగా తినడంతో పాటు పచ్చడి, మురబ్బా, జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు. అయితే మన దేశంలో ఉసిరికాయల సాగుకు ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక ప్రాంతం ఉందని మీకు తెలుసా? అక్కడ వేల ఎకరాల్లో ఉసిరి తోటలు విస్తరించి ఉన్నాయి.

Amla Capital of India: వేల ఎకరాల్లో సాగు.. ఉసిరికాయలు పండించి GI Tag పొందిన నగరం ఏదో తెలుసా?
Amla Capital Of India Pratapgarh Famous For Amla Production
Bhavani
|

Updated on: Nov 17, 2026 | 8:09 PM

Share
ఈ ప్రాంతం కేవలం ఉసిరికాయల సాగుకే పరిమితం కాలేదు. వాటితో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ స్థానిక రైతులు, వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు.. అక్కడ పండే ఉసిరికాయలకు భౌగోళిక గుర్తింపు (GI Tag) కూడా లభించింది. ఇంతకీ భారతదేశపు ఉసిరికాయ రాజధాని ఎక్కడుందో తెలుసుకుందాం.

భారతదేశపు ఉసిరికాయ రాజధాని ఇదే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాను భారతదేశపు ఉసిరికాయ రాజధాని (Amla Capital of India) అని పిలుస్తారు. ఇక్కడ ఉసిరి సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లా అధికారిక గుర్తింపులో కూడా దీనిని ‘సిటీ ఆఫ్ ఆన్లా’గా పేర్కొంటారు. కేంద్ర ప్రభుత్వ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) పథకం కింద ఉసిరిని ఈ జిల్లా ప్రధాన ఉత్పత్తిగా ఎంపిక చేశారు.

20 వేల హెక్టార్లలో ఉసిరి తోటలు

ప్రతాప్‌గఢ్ జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉసిరి తోటలు ఉన్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక ఉసిరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. దేశ ఉసిరి ఉత్పత్తిలో సుమారు 60 శాతం వాటా ఈ రాష్ట్రానిదేనని ప్రభుత్వ పెట్టుబడుల పత్రంలో పేర్కొన్నారు.

ఉసిరితో ఎన్ని రకాల పదార్థాలు తయారు చేస్తారో తెలుసా

ప్రతాప్‌గఢ్‌లో ఉసిరికాయలను కేవలం పండ్లుగా విక్రయించడం మాత్రమే కాదు. వాటితో ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.

  • ఉసిరి క్యాండీ

  • ఉసిరి మురబ్బా

  • ఉసిరి జ్యూస్

  • ఉసిరి పచ్చడి

  • ఉసిరి పొడి

  • ఉసిరి లడ్డూలు

  • చ్యవన్‌ప్రాశ్

ఇలా ఉసిరికాయలను వివిధ రూపాల్లోకి మార్చి విక్రయించడం వల్ల రైతులకు, స్థానిక వ్యాపారులకు ఆదాయ అవకాశాలు పెరుగుతున్నాయి.

ప్రతాప్‌గఢ్ ఉసిరికి GI గుర్తింపు

ఈ ప్రాంత ఉసిరికాయలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతాప్‌గఢ్ ఉసిరికి 2023 మార్చిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) గుర్తింపు లభించింది. ఈ ప్రాంతంలో పండే ఉసిరికాయలు ఆకుపచ్చ, పసుపు రంగుల మిశ్రమంతో పాటు ప్రత్యేకమైన పుల్లని, వగరైన రుచిని కలిగి ఉంటాయి. ఈ గుర్తింపు వాటికి ప్రత్యేక భౌగోళిక గుర్తింపును అందించింది.

మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఉసిరి పరిశ్రమ

ఉసిరి ఆధారిత పరిశ్రమలతో స్థానిక మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు ఉసిరి క్యాండీలు, మురబ్బాలు, జ్యూస్, పచ్చళ్లు, జీర్ణక్రియకు సంబంధించిన పొడులు తయారు చేస్తున్నాయి. 2026 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రతాప్‌గఢ్ ఉసిరి పరిశ్రమ గురించి ప్రస్తావించారు. జిల్లాలో సుమారు 100 ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Follow Us