నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన సినిమాల ఎంపికతో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటుంది.
తాజాగా ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఓం: చాప్టర్ 1 – ఉధిరమ్: ది బ్లడ్ వుడ్' సినిమాలో సాయి పల్లవి కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సినిమాలో సీబీఐ అధికారిణి నిత్యారెడ్డి పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ పాత్ర కోసం సాయి పల్లవి తన ట్రేడ్‌మార్క్‌గా ఉన్న పొడవాటి జుట్టును కత్తిరించుకుంది.
దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి సూచన మేరకు ఆమె ఈ లుక్‌లోకి మారింది. జుట్టు కత్తిరించుకున్న తర్వాత తన కొత్త లుక్‌ను ముందుగా తల్లికి వీడియో కాల్ చేసి చూపించింది.
కూతురి కొత్త లుక్ చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు జుట్టు కత్తిరించుకున్నావంటూ ప్రశ్నలు వేసి వీడియో కాల్ కట్ చేశారు.
ఆ తర్వాత తండ్రి ఫోన్ చేసి.. 'పల్లవి.. ఇది విగ్గు కదా?' అంటూ ఆశ్చర్యంగా అడిగారట. తాను నిజంగానే జుట్టు కత్తిరించుకున్నానని, అది సినిమా పాత్ర కోసమేనని సాయి పల్లవి వివరించింది.
ఈ కొత్త హెయిర్ స్టైల్‌కు అలవాటు పడటానికి తల్లిదండ్రులకు చాలా సమయం పట్టిందని సాయి పల్లవి వెల్లడించింది.