ఈ వృత్తిపై ఉన్న ఇష్టంతో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో ఎం.ఏ పూర్తి చేశాను. ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూలుకు ఎంపికయ్యాను. ఈనాడు, వీ6 వెలుగు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్ సైట్స్‌లో జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, స్పోర్ట్స్, సినిమా, లైఫ్ స్టైల్, హెల్త్‌కి సంబంధించిన విభాగాల్లో పనిచేశాను. ప్రస్తుతం టీవీ 9 నెట్వర్క్ ఇంటర్నెట్ డెస్క్‌లో పర్సనల్ ఫైనాన్స్, హ్యూమన్ ఇంట్రెస్ట్, ట్రెండింగ్, లైఫ్ స్టైల్, హెల్త్, ఫుడ్, ట్రావెలింగ్కు సంబంధించిన వార్తలందిస్తున్నాను.
Weight loss: కేవలం జంపింగ్ చేస్తూ బాడీ షేప్‌లోకి రావాలా? ఈ 3 ఎక్సర్సైజులు ట్రై చేయండి!
బరువు తగ్గాలంటే గంటల తరబడి జిమ్‌లో గడపాలని లేదా ఖరీదైన మిషన్లు ఉండాలని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ, కేవలం మన శరీర బరువుతో చేసే చిన్న చిన్న వ్యాయామాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా కేవలం మూడే మూడు జంపింగ్ వ్యాయామాల ద్వారా 4 నుంచి 5 కిలోల బరువు ఎలా తగ్గాలో వివరించారు. ఆ సింపుల్ వర్కౌట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 9:26 pm
Sabudana Benefits: బిపి కంట్రోల్ అవ్వట్లేదా? ఎముకలు బలహీనంగా ఉన్నాయా? వీటిని తినాల్సిందే!
ఉపవాస సమయాల్లో మనకు మొదట గుర్తుకు వచ్చే ఆహారం 'సగ్గుబియ్యం'. కేవలం సంప్రదాయ వంటకం మాత్రమే కాదు, సగ్గుబియ్యం అద్భుతమైన పోషక విలువల గని. నవరాత్రులు లేదా ఇతర పండుగల సమయంలో రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సగ్గుబియ్యం ఎలా సహాయపడుతుందో, ఇది బరువు పెరగడానికి మరియు ఎముకల బలానికి ఇది ఎలా తోడ్పడుతుందో ఇప్పుడు చూద్దాం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 9:10 pm
Aloo Bhindi Recipe: పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్.. టేస్టీ ఆలూ బెండకాయ ఫ్రై! నిమిషాల్లో రెడీ!
బెండకాయ అనగానే చాలామందికి జిగురు గుర్తుకు వస్తుంది. కానీ, సరైన పద్ధతిలో వండితే బెండకాయ వేపుడు కంటే రుచికరమైన వంటకం మరొకటి ఉండదు. అందులోనూ బంగాళదుంపలు కలిపి చేసే 'ఆలూ భిండి' ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్. అన్నం, రోటీ, చపాతీల్లోకి అదిరిపోయే ఈ వంటకాన్ని జిగురు లేకుండా కరకరలాడేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 8:49 pm
Kulcha Recipe: నోరూరించే పంజాబీ కుల్చా.. ఇంట్లోనే మెత్తగా రావాలంటే ఇలా ట్రై చేయండి!
రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు మనం ఎక్కువగా ఇష్టపడి ఆర్డర్ చేసే వంటకాల్లో 'కుల్చా' ఒకటి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా వెన్న లాంటి రుచితో ఉండే ఈ పంజాబీ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ప్లెయిన్ కుల్చా అయినా లేదా ఆలూ స్టఫ్డ్ కుల్చా అయినా.. పర్ఫెక్ట్ టెక్స్చర్ రావడానికి పాటించాల్సిన చిట్కాలు మీకోసం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 8:21 pm
Vastu Tips: మీ పర్సు ఎప్పుడూ ఖాళీ అవుతుందా? అయితే ఈ ఒక్క వస్తువును లోపల ఉంచి చూడండి!
మనం నిత్యం దగ్గర ఉంచుకునే వస్తువులలో వాలెట్ (పర్సు) అత్యంత ముఖ్యమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన వాలెట్లో కేవలం డబ్బు మాత్రమే కాకుండా, కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మీ పర్సు ఎప్పుడూ డబ్బుతో కళకళలాడాలంటే ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు చూద్దాం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 7:32 pm
Kidney Health : మీ కిడ్నీలు టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయాలంటే ఈ నేచురల్ డ్రింక్స్ తప్పనిసరి!
మన శరీరంలోని వ్యర్థాలను వడపోసి, రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీల ఆరోగ్యం చాలా ముఖ్యం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని అందరికీ తెలుసు. అయితే, కేవలం నీరు మాత్రమే కాకుండా కిడ్నీల పనితీరును మెరుగుపరిచే మరికొన్ని అద్భుతమైన పానీయాలు కూడా ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్లను నివారించి, టాక్సిన్స్‌ను బయటకు పంపే ఆ 7 డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 6:12 pm
Tech Habits: ఫోన్ జేబులో.. ల్యాప్‌టాప్ ఒళ్లో ఉంచుతున్నారా? పురుషులు ఆ చాన్స్ కోల్పోయినట్టే!
మీ ఫోన్‌ను ఎప్పుడూ ప్యాంట్ జేబులో ఉంచుకుంటున్నారా? గంటల తరబడి ల్యాప్‌టాప్‌ను ఒళ్లో పెట్టుకుని పని చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే! ఈ అలవాట్లు పురుషులలో వీర్యకణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, నపుంసకత్వానికి (Impotence) దారితీస్తాయని తాజా భారతీయ పరిశోధన హెచ్చరిస్తోంది. కలకత్తా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ నిజాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి..
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 4:04 pm
Sugar Free Diet: ఇవి తింటే షుగర్ రాదనుకుంటున్నారేమో! మీ లివర్ ప్రమాదంలో పడ్డట్టే!
బరువు తగ్గడానికో లేదా మధుమేహం భయంతోనో మీరు 'షుగర్-ఫ్రీ' (Sugar-free) ఉత్పత్తులను వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. మనం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా భావించే సోర్బిటాల్ వంటి కృత్రిమ స్వీటనర్లు వాస్తవానికి మీ కాలేయానికి (Liver) తీరని హాని కలిగిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఇవి నేరుగా ఫ్రక్టోజ్‌గా మారి కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నాయి.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 3:41 pm
Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్డీ! ఈ బాల మేథావి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
13 ఏళ్ల వయసులో పిల్లలు సాధారణంగా స్కూల్ ఆటపాటల్లో నిమగ్నమై ఉంటారు. కానీ, బీహార్‌కు చెందిన ఒక సామాన్య రైతు బిడ్డ మాత్రం అదే వయసులో దేశంలోనే అత్యంత కఠినమైన ఐఐటీ-జేఈఈ (IIT-JEE) పరీక్షను ఛేదించి చరిత్ర సృష్టించాడు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ఐఐటీయన్‌గా రికార్డు సృష్టించిన ఆ కుర్రాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలుసా?
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 1:50 pm
Happy Life Tips: కోట్లు పెట్టినా కొనలేరు.. మీ జీవితాన్ని సంతోషంగా మార్చే మంత్రం ఇదే!
ఎంత సంపద ఉన్నా, ఎన్ని విలాసాలు ఉన్నా మనసులో శాంతి లేకపోతే ఆ జీవితం వ్యర్థమే. శాంతి అంటే కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు, అది ఒక అజేయమైన శక్తి. మన మాటలు, కోరికలు మన ప్రశాంతతను ఎలా దూరం చేస్తున్నాయో.. మౌనం ద్వారా మనల్ని మనం ఎలా గెలుచుకోవచ్చో వివరించే అద్భుత కథనం మీకోసం.
- Bhavani
- Updated on: Dec 26, 2025
- 12:20 pm
Mindfulness Techniques: ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ 5 నిమిషాల ‘మైండ్‌ఫుల్’ టెక్నిక్ వెంటనే రిలీఫ్
ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, భవిష్యత్తు గురించి ఆందోళన.. ఇవన్నీ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అయితే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన ఆలోచనలను ఎటువంటి తీర్పులు లేకుండా గమనించడమే 'మైండ్‌ఫుల్‌నెస్'. ప్రతి రోజు చేసే ఈ చిన్న అలవాటు మీ ఒత్తిడిని మాయం చేసి, జీవితాన్ని ఎంత అందంగా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం.
- Bhavani
- Updated on: Dec 25, 2025
- 10:15 pm
Online Orders: మీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సిళ్లు రావు! వేలాది ఆర్డర్లు నిలిపివేత.. ఎందుకో తెలుసా?
క్రిస్మస్ వేడుకల వేళ ఆన్లైన్ ఫుడ్ ప్రేమికులకు మరియు షాపర్లకు పెద్ద షాక్ తగిలింది. ముందే ప్రకటించినట్లుగా డెలివరీ భాగస్వాములు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. దీంతో ఉదయం నుంచి స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లలో ఆర్డర్లు ప్లేస్ కాకపోవడం, పెట్టిన ఆర్డర్లు అర్ధాంతరంగా క్యాన్సల్ కావడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక అసలు కారణాలేంటో చూద్దాం..
- Bhavani
- Updated on: Dec 25, 2025
- 9:59 pm