ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిమనా తండాలో ఇటీవల జరిగిన చోరీ ప్రజలను ఆశ్చర్యపరిచింది. గూగులోతు వీరు అనే కూలీ ఇంట్లో నుండి 1.3 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి దొంగిలించబడింది. పోలీసుల విచారణ ప్రారంభమైన మరుసటి రోజు, దొంగిలించిన నగదు, వెండి ఇంటి ఆవరణలో తిరిగి ప్రత్యక్షమయ్యాయి.