AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లలకు తక్కువ మార్కులు వస్తున్నాయా?.. కారణం మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే!

సంవత్సరాంతపు పరీక్షలు వస్తున్నాయంటే చాలు, పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ కంగారు పడిపోతుంటారు. పిల్లలు గదిలోనే ఉండి చదవాలని, బయటకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తుంటారు. కానీ, అతిగా ఒత్తిడి చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గి, తెలిసిన జవాబులు కూడా మర్చిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా? మార్కులు ముఖ్యం కాదని ఎవరూ అనరు, కానీ ఆ మార్కుల కోసం వారి బాల్యాన్ని, మానసిక ప్రశాంతతను పణంగా పెట్టడం సరికాదు.

Parenting Tips: మీ పిల్లలకు తక్కువ మార్కులు వస్తున్నాయా?.. కారణం మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే!
Child Confidence Building
Bhavani
|

Updated on: Feb 28, 2026 | 5:44 PM

Share

పరీక్షల సమయంలో పిల్లలకు తల్లిదండ్రుల నుండి కావలసింది తిట్లు కాదు, కొండంత అండ. “నువ్వు సాధించగలవు” అనే ఒక్క మాట వారిలో అంతులేని ఉత్సాహాన్ని నింపుతుంది. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఏ విద్యార్థి అయినా అద్భుతాలు చేయగలడు. కేవలం చదువు మాత్రమే కాకుండా, వారి మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ వారిని పరీక్షలకు ఎలా సిద్ధం చేయాలో తెలుసుకుందాం.

1. ఆడుకోవడానికి సమయం ఇవ్వండి

రోజంతా స్కూల్, ట్యూషన్లతో అలసిపోయిన పిల్లలను కాసేపు ఆడుకోనివ్వండి. శారీరక శ్రమ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. “చదువు.. చదువు” అని నిరంతరం వేధించడం వల్ల వారికి ఒత్తిడి పెరుగుతుంది తప్ప జ్ఞానం రాదు.

2. అతిగా పర్యవేక్షించకండి

పిల్లలు ఎవరితోనైనా మాట్లాడుతున్నా లేదా ఏదైనా చేస్తున్నా అనుమానంగా చూడటం ఆపండి. మీ నిరంతర హెచ్చరికలు వారిలో భయాన్ని కలిగిస్తాయి. వారు తప్పులు చేసినా ఫర్వాలేదు, వాటి నుండి నేర్చుకునేలా ప్రోత్సహించండి.

3. పోలికలు వద్దు.. ప్రోత్సాహం ముద్దు!

మీ బిడ్డను పక్కింటి అబ్బాయితోనో లేదా బంధువుల పిల్లలతోనో పోల్చకండి. ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. “నువ్వు తెలివైనవాడివి.. నువ్వు విజయం సాధిస్తావు” అని వారికి నమ్మకాన్ని ఇవ్వండి. మీ ప్రోత్సాహమే వారి విజయానికి మొదటి మెట్టు.

4. టీవీ, మొబైల్స్‌కు దూరం

పిల్లలు చదువుకునే సమయంలో ఇంట్లో పెద్దలు టీవీ చూడటం మానేయాలి. శబ్దాల వల్ల వారి దృష్టి మరలుతుంది. అలాగే పిల్లలకు అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఇచ్చి, మీరు దగ్గరుండి పర్యవేక్షించడం ఉత్తమం.

5. పోషకమైన ఆహారం – మెదడుకు మేత

పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. పాలు, మజ్జిగ, పండ్ల రసాలు మరియు గుడ్లు వంటి పోషకాహారం ఇవ్వండి. నిద్రలేమి లేకుండా చూసుకోండి. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.

6. కుటుంబ ఆర్థిక స్థితిపై అవగాహన

పిల్లలకు కుటుంబ పరిస్థితుల గురించి, చదువు ప్రాముఖ్యత గురించి వివరించండి. దీనివల్ల వారు బాధ్యతాయుతంగా చదువుకుంటారు కష్టపడే తత్వాన్ని అలవర్చుకుంటారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్