కరివేపాకును ఇలా తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది!

Jyothi Gadda

21 November 2026

కరివేపాకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం తప్పుతుంది. అంతేకాకుండా ఇది ఒత్తిడిని తగ్గించి అధిక రక్తపోటుతో బాధపడే రోగులకు మంచి ఉపశమనాన్నిస్తుంది.  కాపాడుతుంది.

కరివేపాకు శరీరంలో రక్త ప్రసరణను సజావుగా నిర్వహిస్తుంది. ఇది రక్త కణాలలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తూ, చెడు రక్త ప్రసరణ కారణంగా వచ్చే వ్యాధుల నుంచి మెదడు నరాలు దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తుంది.

రక్తపోటు పెరిగినప్పుడు తలలో తీవ్రమైన టెన్షన్ ఏర్పడి నరాల నొప్పి వస్తుంది; అయితే కరివేపాకును రోజూ తీసుకోవడం వల్ల ఈ తలనొప్పి బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది చెడు రక్తాన్ని తొలగించి కొత్త మంచి రక్త కణాలు ఏర్పడేలా ప్రేరేపించడం ద్వారా రక్త ప్రసరణకు హాని కలగకుండా బీపీని స్థిరంగా ఉంచుతుంది.

కరివేపాకు సారం తీసుకోవడం వల్ల రక్తంలోని హార్మోన్ల ప్రసరణ మెరుగుపడి రక్త కణాలు చాలా చురుకుగా పనిచేస్తాయి. ముఖ్యంగా మెదడు నాడులు, మెదడు పనితీరు ఎంతో మెరుగ్గా ఉంటాయి.

కరివేపాకును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను అరికట్టి, ప్రాణాంతకమైన గుండెపోటు సంభవించే అవకాశాన్ని చాలా సమర్థవంతంగా నివారించవచ్చని చెబుతున్నారు.

హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేసి హృదయనాళ వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగి స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేసి హృదయనాళ వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగి స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.