AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మినపట్టు కంటే ఈ దోశలు 5 రెట్లు ఎక్కువ.. 10 నిమిషాల్లో రెడీ

మినప, పెసరట్టు కంటే ఈ దోశలు ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైనవి. దీని కోసం మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం పదినిమిషాల్లోనే రెడీ అవుతాయి. . దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Nov 23, 2026 | 9:17 AM

Share
మినప, పెసరట్టు కంటే ఈ దోశలు ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైనవి. దీని కోసం మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం పదినిమిషాల్లోనే రెడీ అవుతాయి. . దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

మినప, పెసరట్టు కంటే ఈ దోశలు ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైనవి. దీని కోసం మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం పదినిమిషాల్లోనే రెడీ అవుతాయి. . దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

 గోధుమ పిండి దోశకు  కావలసిన పదార్దాలు :ఒక కప్పు, నీళ్లు ఒకటిన్నర కప్పులు, ఉప్పు ఒక స్పూన్, బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడాను తీసుకోవాలి

2 / 5

 గోధుమ పిండి దోశ తయారీ విధానం:ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని, అర కప్పు పెరుగు, రెండు స్పూన్ల బొంబాయి రవ్వ, ఒకటిన్నర కప్పుల నీళ్లు, ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా మూడు నిమిషాల పాటు వేగంగా గిలకొడితే ఉండలు లేకుండా పిండి మెత్తగా తయారవుతుంది.

3 / 5
 గోధుమ పిండి దోశ తయారీ విధానం స్టెప్ 1 : ఆ తర్వాత ఈ పిండిని పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి. కొంచం సేపు  తర్వాత అందులో కొంచెం వంట సోడా, సన్నగా తరిగిన  పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసి మరొక నిమిషం పాటు బాగా కలపాలి.

4 / 5
 గోధుమ పిండి దోశ తయారీ విధానం స్టెప్ 2 : ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి వేసి పలుచగా గుండ్రంగా దోశలా పరచాలి. దోశ అంచుల వెంట కొంచెం నెయ్యి వేస్తూ కాల్చాలి. ఒకవైపు బాగా దోరగా కాలిన తర్వాత మరొకవైపు తిప్పి కొంచెం నెయ్యి వేసి దోరగా కాల్చుకోవాలి.

5 / 5
Follow Us