AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tilak Vamra: ఓడి కూడా సహచరులపై నిందలేంటయ్యా.. స్లో సెంచరీపై తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్..!

Tilak Varma Blames Teammates: దోహా వేదికగా పాకిస్థాన్-A చేతిలో 48 పరుగుల ఓటమి తర్వాత టీమిండియా-A కెప్టెన్ తిలక్ వర్మ సహచరులపై నిందలు మోపాడు. 149 బంతుల్లో 100 చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో బ్యాటర్ నిలిచి ఉంటే మ్యాచ్ ఫినిష్ చేసేవాడినని చెప్పాడు. కానీ అభిషేక్, షాబాజ్ రాణించినా నెమ్మదిగా ఆడాడనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇవే.

Tilak Vamra: ఓడి కూడా సహచరులపై నిందలేంటయ్యా.. స్లో సెంచరీపై తిలక్ వర్మ షాకింగ్ కామెంట్స్..!
Tilak Varma Century Comments
Venkata Chari
|

Updated on: Nov 23, 2026 | 8:45 AM

Share

Tilak Varma Blames Teammates: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దోహాలో జరిగిన 8వ మ్యాచ్‌లో భారత్-A 48 పరుగుల తేడాతో పాకిస్థాన్-A చేతిలో ఓడిపోయింది. 314 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్‌లో మాట్లాడిన తిలక్, సహచరుల నుంచి సహకారం లేకపోవడమే ఓటమికి కారణమని అన్నాడు.

“నాకు గెలవడమే బెస్ట్. గెలవకపోతే అది నాకు బెస్ట్ కాదు. నేను ఎప్పుడూ డీప్‌గా తీసుకెళ్లాలని చూస్తాను. ఈరోజు కూడా అదే చేశాను. మరో బ్యాటర్ నాకు సపోర్ట్ ఇచ్చి ఉంటే నేను మ్యాచ్ ఫినిష్ చేసేవాడిని” అని తిలక్ చెప్పాడు.

అయితే తిలక్ వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అతడికి సహకారం అందలేదనడం పూర్తి నిజం కాదనే వాదన వినిపిస్తోంది.

ఓపెనర్ అభిషేక్ శర్మ 42 బంతుల్లో 70 పరుగులతో దూకుడుగా ఆడి మూడో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ సమయంలో తిలక్ 36 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశాడు. ఆ తర్వాత జట్టు 129/6 వద్ద కష్టాల్లో పడినప్పుడు షాబాజ్ అహ్మద్ 49 బంతుల్లో 56 పరుగులతో అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. భారీ షాట్‌కు ప్రయత్నించి షాబాజ్ ఔటయ్యాడు.

అభిషేక్, షాబాజ్ బౌండరీలు బాదుతుంటే తిలక్ వరుస డాట్ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడనే విమర్శలు వస్తున్నాయి. వేగం పెంచే అవకాశాలు ఉన్నా అతడు నెమ్మదిగానే ఆడాడు. సెంచరీ పూర్తవగానే భారీ షాట్‌కు వెళ్లి ఔటయ్యాడు. అప్పటికి చివరి 6 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి, అది అసాధ్యంగా మారింది.

సెంచరీ చేసి కూడా జట్టును గెలిపించలేక, సహచరులను తప్పుబట్టడంపై తిలక్‌పై నెటిజన్లు, మాజీలు మండిపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us