AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15లోగా.. రెడీగా ఉండండి..

ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత చేపట్టింది. ఈ క్రమంలో పేదలు ఇళ్లను కోల్పోగా.. వీరికి ప్రభుత్వం భరోసా కల్పించింది. పేదలకు ఈ నెల 15వ తేదీలోగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి ప్రకటన చేశారు.

Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15లోగా.. రెడీగా ఉండండి..
Telangana Indiramma Indlu Scheme
Venkatrao Lella
|

Updated on: Mar 02, 2026 | 8:20 AM

Share

గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉచితంగా ఇంటి స్థలం కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. పేదలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వెలుగుమట్లలో పేదలు ఉచితంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైనవారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు.  ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌తో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడంకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం తమ ప్రభుత్వంలో జరగదని భరోసా కల్పించారు.

అర్హులను గుర్తింపు

ఇళ్లను కోల్పోయిన పేదలను గుర్తించేందుకు సామాజిక, ఆర్ధిక సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైనవారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడంతో పాటు అంగన్ వాడీ, ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొందరు మాజీ మంత్రులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు నివాసయోగ్యమైన స్థలం కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. పేదల దీనెనతో ఏర్పడిన ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం చేయమన్నారు. ఇల్లు కూల్చివేత విషయంలో ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్ల వినోబాభావే భూదాన్ భూముల్లో ఇటీవల ఇళ్లను కూల్చివేశారు. ఈ భూముల్లో ఎనిమిదేళ్ల క్రితం నుంచి 720 కుటుంబాలు ఇళ్లను నిర్మించుకుని ఉంటున్నాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారన్నారు. సర్వే తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపారు.

ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

ఇక హైదరాబాద్‌లో ఉన్న పేదలకు ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇప్పటికే లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ పూర్తయింది. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో నిజమైన లబ్దిదారులా.. కాదా అనేది గుర్తించారు. ఇంటి స్థలం నుంచి ఇళ్లను నిర్మించుకోవాలనుకునేవారికి ఇందిరమ్మ ఇళ్లను త్వరలో మంజూరు చేయనున్నారు. అలాగే ఇంటి స్థలం లేనవారికి భవన సముదాయాలు నిర్మించి ఇళ్లను కేటాయించనున్నారు. ఇప్పటికే భవన సముదాయాలను నిర్మించేందుకు ప్రభుత్వం స్థలాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాల ఎంపిక జరిగింది. అందులో నిర్మాణ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర