గుడ్డు రోజూ తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి జరిగే మేలు ఇదే!
27-07-2026
Pic credit - Instagram
Phani Ch
గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో చౌకగా, సులభంగా లభించే పౌష్టికాహారంలో కోడిగుడ్డు మొదటి స్థానంలో ఉంటుంది.
సుమారు 50-60 గ్రాముల బరువుండే ఒక గుడ్డు నుంచి శరీరానికి 70 నుండి 80 కిలోకాలరీల శక్తి లభిస్తుంది. అలాగే ఇందులో సుమారు 6.3 గ్రాముల అత్యుత్తమ నాణ్యత కలిగిన ప్రొటీన్ కూడా లభిస్తుంది.
గుడ్డులో ప్రొటీన్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, బి-12, జింక్, ఐరన్ మరియు సెలీనియం వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
చాలామంది గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పెరుగుతాయని భావిస్తారు. కానీ పచ్చసొన వల్ల హెచ్‌డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఎండలో ఎక్కువగా తిరగని వారికి విటమిన్ డి లోపం ఏర్పడుతుంటుంది. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి సమృద్ధిగా లభించడం వల్ల ఎముకలు బలంగా మారడానికి ఉపయోగ పడుతుంది.
గుడ్డులోని పచ్చసొనలో ఉండే 'కోలిన్' అనే పోషకం చిన్న పిల్లలు మరియు పసిపిల్లల్లో మెదడు ఎదుగుదలకు, జ్ఞాపకశక్తి పెరగడానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.