రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

16 June 2026

Pic credit - Instagram

Phani Ch

"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు" అనే సామెత ఊరికే రాలేదు. దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పచ్చి ఉల్లిపాయను రోజూ ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

ఉల్లిపాయలలో 'క్వెర్సెటిన్' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మరియు క్రోమియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  డయాబెటిస్ తో బాధపడేవారికి పచ్చి ఉల్లిపాయ తినడం ఎంతో మేలు చేస్తుంది.

ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను బలపరుస్తాయి. ఇవి సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల బారి నుండి మన శరీరాన్ని కాపాడతాయి.

జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి ఉల్లిపాయ ఒక మంచి ఔషధం. ఇందులో ఉండే పీచు పదార్థం (ఫైబర్) మరియు ఇన్యులిన్ అనే ప్రీబయోటిక్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే వాటిని తగ్గించడానికి తోడ్పడతాయి.

మహిళల్లో వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల బలహీనత సమస్యలను అరికట్టడానికి, రోజువారీ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను చేర్చుకోవడం చాలా మంచిది.