ప్రపంచంలో రకరకాల పండ్లు దొరుకుతాయి. అయితే ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పండును ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు.
అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అత్యధికంగా తినే పండు ఏది అనే ప్రశ్న వస్తే.. చాలా మంది నోట అరటిపండు, యాపిల్ లేదా మామిడిపండు అనే పేర్లు సమాధానంగా వస్తాయి. కానీ అది నిజం కాదు.
నిజానికి, ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే పండు 'టమోటా' (Tomato). అవును, మీరు విన్నది నిజమే! మనం సాధారణంగా టమోటాను ఒక కూరగాయగా భావిస్తాం.
కానీ వృక్షశాస్త్రం లేదా సైన్స్ ప్రకారం, టమోటా అనేది కూరగాయ కాదు.. అది ఒక అద్భుతమైన పండు జాతికి చెందినది.
సైన్స్ పరంగా చూస్తే, ఏ మొక్కల భాగాల్లో అయితే గింజలు లేదా విత్తనాలు ఉండి, అవి పూల నుండి అభివృద్ధి చెందుతాయో వాటిని పండ్లు అంటారు.
టమోటాలో గింజలు ఉండటం వల్ల దీనిని పండ్ల జాబితాలోనే చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మిలియన్ల టన్నుల టమోటాలను ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా తినే పండ్ల జాబితాలో టమోటా మొదటి స్థానంలో నిలిస్తే.. ఆ తర్వాత స్థానంలో 'అరటిపండు' నిలుస్తుంది.