AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

'ఖైదీ' సినిమా తరహాలో ఒక్క రాత్రిలో జరిగే నేరాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే. ఒక్కసారి సినిమా స్టార్ట్ చేశాక కథనం పరుగులు పెడుతుంది. మధ్యలో వచ్చే ట్విస్టులు అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు.

OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 27, 2026 | 9:47 PM

Share

ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మూడు రోజుల క్రితం ఒక కన్నడ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి ఓటీటీకి వచ్చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రెండు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గ ఉంటుంది. కొండాన అనే చిన్న పట్టణంలో ఒకే రోజు రాత్రి జరిగిన ఊహించని ఘటనల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కర్ణాటకలోని కొండాన ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ హత్య కేసు ఛేదించేందుకు ఏసీపీ లక్ష్మి (భావన) రంగంలోకి దిగుతుంది. ఇదే టైంలో ఏఎస్ఐగా విల్సన్ (విజయ్ రాఘవేంద్ర) కొత్తగా వస్తాడు. ఒక రోజు పానీ పూరి అమ్మే వ్యక్తి డబ్బు దొంగిలించేందుకు యత్నిస్తుండగా గమనించిన విల్సన్ అతనిపై దాడి చేస్తాడు. దీంతో అతను చనిపోతాడు. దీంతో విల్సన్ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇదే క్రమంలో సీరియల్ కిల్లర్ కోసం వెతుకుతున్న ఏసీపీకి విల్సన్ టార్గెట్ గా మారతాడు. ఇదే క్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విల్సన్ మరిన్ని అడ్డదారులు తొక్కుతాడు? మరి ఈ కేసు నుంచి బయటపడేందుకు విల్సన్ ఏం చేశాడు? వరుస మర్డర్స్ చేసే సీరియల్ కిల్లర్ ఎవరు? చివరకు ఈ కథ ఎలాంటి ముగింపుకు వచ్చింది అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఆసక్తికరమైన కథా, కథనాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘కేస్ ఆఫ్ కొండాన’ ( Case Of Kondana). ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ రాఘవేంద్ర, భావన మీనన్, ఖుషీ రవి, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి ప్రసాద్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ కన్నడ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు , వెబ్ సిరీస్ లు ఇష్టపడే వారికి కేస్ ఆప్ కొండాన ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

కేస్ ఆఫ్ కొండాన సినిమా ట్రైలర్..

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us