AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం.. కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయమై పూరి కూతురు పవిత్ర సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పూరీ ఫ్యామిలీకి సంఘీభావం తెలుపుతున్నారు.

Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..  కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్
Puri Jagannadh
Basha Shek
|

Updated on: Jul 26, 2026 | 5:45 PM

Share

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయమై ఇతడి కూతురు పవిత్ర సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శనివారం (జులై 25) నానమ్మ చనిపోయిన విషయాన్నిఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన ఆమె.. ‘ ‘ఇ‍ప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ’ అని పూరీ జగన్నాధ్ కూతురు ఇన్ స్టా స్టోరీ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూరీ కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుటు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, బద్రి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, దేశముదురు, నేనింతే, బుజ్జిగాడు, బిజినెస్ మెన్, గోలీమార్, టెంపర్ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు పూరి. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడీ డ్యాషింగ్ డైరెక్టర్. ముఖ్యంగా టెంపర్ తర్వాత పూరీకి సరైన హిట్ పడడం లేదు. ఇస్మార్ట్ శంకర్ మాత్రమే కాస్త యావరేజ్ గా నిలిచింది. జ్యోతిలక్ష్మీ, ఇజం, పైసా వసూల్, రోగ్, మెహబూబా, లైగ‌ర్, ఇస్మార్ట్ శంకర్ 2.. ఇలా ఒకదాని మించి మరొకటి ఫ్లాపులొచ్చాయి.

ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాత్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. విజయ్ సేతుపతితో పాటు టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్‌తో పాపులర్ అయిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. బహుశా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
Puri Jagannadh Daughter

Puri Jagannadh Daughter

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us