AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నేను రెడీ’ నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ మెలొడీ.. హరీష్, కావ్యా థాపర్ రొమాన్స్ మామూలుగా లేదుగా

గతంలో నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్. అలాగే సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి ఎంటర్ టైనర్లను తెరకెక్కించి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన.

'నేను రెడీ' నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ మెలొడీ.. హరీష్, కావ్యా థాపర్ రొమాన్స్ మామూలుగా లేదుగా
Nenu Ready Movie
Basha Shek
|

Updated on: Jul 25, 2026 | 6:15 AM

Share

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’ ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట ‘కొంచెం కొంచెం’ను లాంచ్ చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ‘కొంచెం కొంచెం’ రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. పాటలోని రొమాంటిక్ మూడ్‌ను అందంగా ప్రజెంట్ చేసిన ట్యూన్‌తో పాటు, మ్యూజిక్ అరేంజ్‌మెంట్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. సమీరా భరద్వాజ్ తన మెలోడీ వోకల్స్ తో పాటలోని భావాలను మరింత అందంగా పలికించారు.

ఈ పాటలో హవీష్, కావ్యా థాపర్ మధ్య కనిపించే రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ స్పెషల్ అప్పియరెన్స్‌తో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆమె గ్లామర్‌తో పాటు స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ కూడా పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆకట్టుకునే ట్యూన్, సరదా సాహిత్యం, మెలోడీ వోకల్స్, స్టైలిష్ విజువల్స్‌తో ‘కొంచెం కొంచెం’ పూర్తి స్థాయి రొమాంటిక్ సాంగ్‌గా అలరిస్తోంది.

‘నేను రెడీ’ మ్యూజికల్ జర్నీకి ‘కొంచెం కొంచెం’ బ్లాక్‌బస్టర్ ఆరంభాన్ని ఇచ్చింది. విడుదలైన వెంటనే ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. క్యాచీ ట్యూన్, ఆకట్టుకునే విజువల్స్, హవీష్-కావ్యా థాపర్ కెమిస్ట్రీ ఈ పాటను చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. యూత్‌ను ఆకట్టుకునే ఈ పాట రాబోయే రోజుల్లో మ్యూజిక్ ప్లేలిస్ట్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, విక్రాంత్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో హవీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన బాబీ గారికి, కేఎల్ నారాయణ గారికి ధన్యవాదాలు. వాళ్లు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నాకు కాస్త సిగ్గు ఎక్కువ. కానీ త్రినాథరావు గారు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు (నవ్వుతూ). నా వరకు యాక్టింగ్‌లో అన్నిటికంటే కష్టమైనది రొమాన్స్ చేయడమే. త్రినాథరావు గారు ఈ కథ చెప్పినప్పుడే నేను చాలా ఎంటర్‌టైన్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. నాకు నటన అంటే చాలా ఇష్టం. నటనలోనే నాకు సంతృప్తి ఉంటుంది. ఈ సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. నా కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది, పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ ఏడాది వచ్చే బెస్ట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ” అని అన్నారు.

నేను రెడీ సినిమా రొమాంటిక్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌