AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: త్రిగుణ్, ముఖేష్ కాదు.. బిగ్‌బాస్ 10 విన్నర్ అతనే.. ఎవరూ ఊహించని పేరు చెప్పిన రోహిత్ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ కంటెస్టెంట్ రోహిత్ నాయుడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన బిగ్ బాస్ విన్నర్, టాప్- 5 కంటెస్టెంట్స్ ఎవరన్న విషయాలపై తనదైన శైలిలో సమాధానాలిచ్చాడు.

Bigg Boss Telugu 10: త్రిగుణ్, ముఖేష్ కాదు.. బిగ్‌బాస్ 10 విన్నర్ అతనే.. ఎవరూ ఊహించని పేరు చెప్పిన రోహిత్ 
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 27, 2026 | 7:13 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 12 వ వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మహా అంటే ఈ రియాలిటీ షో మరో మూడు వారాలు కొనసాగవచ్చు. దీంతో బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరు? టాప్-5 లో ఎవరెవరు ఉంటారు? అన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బిగ్ బాస్ విన్నర్లు, మాజీ కంటెస్టెంట్స్, రివ్యూయర్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ఎవరూ ఊహించని సమాధానాలిచ్చారు రోహిత్ నాయుడు. అగ్ని పరీక్ష సీజన్ 2లో సత్తాచాటి కామనర్ కోటాలో బిగ్ బాస్ 10 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్. తన దైన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. ముఖ్యంగా సెలబ్రిటీలతో పోటా పోటీగా తలపడుతూ ఓటింగ్ లో దూసుకపోయాడు. ప్రారంభంలో రోహిత్ ఆట తీరును చూసి చాలా మంది ఇతను టాప్-5లో కచ్చితంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇక కొందరైతే బిగ్ బాస్ 10 విన్నర్ రోహితే అని ఫిక్స్ అయిపోయారు. అయితే అదేమీ జరగలేదు. చివరి వరకు హౌస్ లో ఉంటాడనుకున్న రోహిత్ అనూహ్యంగా ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రోహిత్ రీఎంట్రీపై పలు వార్తలు వచ్చినా అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. ప్రస్తుతం టీవీ షోల్లో పార్టిసిపేట్ చేస్తోన్న రోహిత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ 10 గురించి అలాగే తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారని మీరు అనుకుంటున్నారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ ఇలా సమాధానం చెప్పాడు. ‘ బిగ్ బాస్ 10 టైటిల్ విన్నర్ బయటకు వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు’ అని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు రోహిత్. ఇక టాప్ 5 గా ఎవరెవరు నిలుస్తారని మీరు అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ..’ నేను అసలు బిగ్ బాస్ ని చూడడం లేదు, జియో హాట్ స్టార్ ని ఇన్ స్టాల్ కూడా చేసుకోలేదు’ అని క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇక ప్రజెంట్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, ప్రస్తుతానికి అయితే ఎవ్వరూ లేరని సమాధానం ఇచ్చాడు. ఇక మీ భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మళ్లీ ఐటీ జాబ్ కోసం వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ ఇలా ఆన్సర్ ఇచ్చాను. ప్రస్తుతానికి అయితే మళ్లీ జాబ్ కు వెళ్లే ఆలోచన లేదు. ఎంటర్టైన్మెంట్ రంగం లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి. సరైన ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తాను. భవిష్యత్తు నన్ను ఎటు వైపుకు తీసుకెళ్తుందో చూడాలి’ అని చెప్పుకొచ్చాడు రోహిత్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

బిగ్ బాస్ 10 లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us