AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 100 కోట్ల లాటరీ తెచ్చిన ఇబ్బందులు.. ఓటీటీలోకి వచ్చేసిన వెంకీ- త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47'. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. కలెక్షన్లు కూడా బాగానే ఓ మోస్తరుగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: 100 కోట్ల లాటరీ తెచ్చిన ఇబ్బందులు.. ఓటీటీలోకి వచ్చేసిన వెంకీ- త్రివిక్రమ్‌ల 'ఆదర్శ కుటుంబం'
Aadarsha Kutumbam Movie
Basha Shek
|

Updated on: Nov 27, 2026 | 6:53 AM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కన్నడ బ్యూటీ, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 30న గ్రాండ్ గా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మరీ మల్లీ శ్వరి, నువ్వు నాకు నచ్చావ్ రేంజ్ లో లేకపోయినా ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. విక్టరీ వెంకటేష్ సెటిల్ట్ యాక్టింగ్, త్రివిక్రమ్ డైరెక్షన్, డైలాగులు, శ్రీనిధి, నివేద, డింపుల్ గ్లామర్ ఆదర్శ కుటుంబం సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అలాగే థమన్ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ వెంకీ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఆదర్శ కుటుంబం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ. 40 కోట్లకు పైగా సినిమా నిర్మాతలకు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 27) అర్ధరాత్రి నుంచే వెంకీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’ సినిమాను నిర్మించారు. నారా రోహిత్, యువీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌భీర్ సంధూ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. . రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, నవిన్ నూలీ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. 100 కోట్ల లాటరీ తీసుకొచ్చే కష్టాలతో కామెడీ, యాక్షన్, వయోలెన్స్‌తో ఆదర్శ కుటుంబం సినిమాను తెరకెక్కించారు. మరి థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఆదర్శ కుటుంబం సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో ఆదర్శ కుటుంబం..

ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే