AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌ బాక్సాఫీస్‌ను ‘లెనిన్’ షేక్ చేస్తాడా.. అయ్యగారు హిట్ కొట్టేనా!

అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అఖిల్. సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి.. అఖిల్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. అయితే వరుస ఫ్లాప్ లతో ఉన్న ఆయనకు "లెనిన్" మూవీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని జపాన్ లోనూ రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.

జపాన్‌ బాక్సాఫీస్‌ను 'లెనిన్' షేక్ చేస్తాడా.. అయ్యగారు హిట్ కొట్టేనా!
Akkineni Akhil Lenin
Korivi Jayakumar
|

Updated on: Nov 26, 2026 | 9:11 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగార్జున వారసుడిగా సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు “అఖిల్”. ‘మనం’ సినిమా చివరలో చిన్న గెస్ట్ రోల్ లో నటించి మెప్పించారు. అఖిల్ సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఆ తర్వాత ఈ యంగ్ హీరో నటించిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజంట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సుమారు మూడేళ్ల గ్యాప్ తీసుకొని “లెనిన్” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న అయ్యగారు.. ఒకేసారి వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోవడంతో అక్కినేని ఫ్యామిలీతో పాటుగా ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

జపాన్ రిలీజ్..

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. అలాగే శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారిగా అఖిల్ రూరల్ కుర్రాడి పాత్ర పోషించి నటనలో అదరగొట్టారు. అయితే ఇప్పుడు లెనిన్ మూవీ జపాన్ లోనూ అలరించేందుకు సిద్ధం అవుతోంది. 2026 డిసెంబర్ 11న జపాన్‌ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు కొత్త పోస్టర్ తో పాటు, అఫీషియల్ వెబ్ సైట్ http://lenin-movie.com వివరాలను పంచుకున్నారు.

ఇక తెలుగు సినిమాలకు ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సైతం మంచి గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ జపాన్‌లో తెలుగు చిత్రాలకు మంచి క్రేజ్ నెలకొంది. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘ముత్తు’, అమీర్ ఖాన్ దంగల్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు. ఇక తెలుగు హీరోలు ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, సలార్ చిత్రాలతో రికార్డు కలెక్షన్స్ సాధిస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రికార్డులను తిరగరాశారు. అలానే పుష్ప, దేవర చిత్రాలు సైతం మంచి మంచి సక్సెస్ సాధించాయి. నాగార్జున సైతం ‘మనం’, ‘శివ’ చిత్రాలతో జపనీయుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. దాంతో ఇప్పుడు వారి బాటలోనే అఖిల్ కూడా హిట్ కొడతాడా ? లేదా అని జోరుగా చర్చ నడుస్తోంది.

మరోవైపు అక్కినేని అఖిల్.. తన ప్రేయసి జైనాబ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 6వ తేదీన హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అత్యంత ఘనంగా జరిగిన ఆ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న అఖిల్ త్వరలోనే మరో మూవీ అప్డేట్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

సూర్యుడు ఉదయించే దేశం వైపు..

Follow Us
జపాన్‌ బాక్సాఫీస్ బరిలో 'లెనిన్'.. అయ్యగారు హిట్ కొట్టేనా!
జపాన్‌ బాక్సాఫీస్ బరిలో 'లెనిన్'.. అయ్యగారు హిట్ కొట్టేనా!
అప్పట్లో ఈ పాట ఓ ఊపు ఊపేసింది.. ఇప్పటికీ యూట్యూబ్‏లో సెన్సేషన్..
అప్పట్లో ఈ పాట ఓ ఊపు ఊపేసింది.. ఇప్పటికీ యూట్యూబ్‏లో సెన్సేషన్..
కొత్త ఏడాదిలో 12 రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చే రంగులు ఇవే..
కొత్త ఏడాదిలో 12 రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చే రంగులు ఇవే..
దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు..!
దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు..!
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
భగవద్గీతలోని నాలుగో అధ్యాయం చదివితే ఇన్ని పుణ్యఫలాలా? శాపవిమోచనం
భగవద్గీతలోని నాలుగో అధ్యాయం చదివితే ఇన్ని పుణ్యఫలాలా? శాపవిమోచనం
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డులపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన !
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డులపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన !