AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరానికి తక్షణ శక్తినిచ్చే నానమ్మల నాటి వంట.. ఉప్పుడు పిండి

ఆధునిక కాలంలో రకరకాల ఇన్‌స్టంట్ టిఫిన్లు అందుబాటులోకి వచ్చినా.. మన అమ్మమ్మలు, నానమ్మల చేతివంటలో ఉండే ఆ స్వచ్ఛమైన కమ్మదనం, ఆరోగ్యం మరెందులోనూ దొరకదు. అలాంటి ఒక అపురూపమైన పాతకాలం తెలుగు సాంప్రదాయ వంటకమే 'ఉప్పుడు పిండి'. కేవలం బియ్యం నూక, పెసరపప్పులతో చేసే ఈ వంటకం జీర్ణశక్తికి ఎంతో తేలికగా ఉండటమే కాకుండా తక్షణ శక్తినిస్తుంది. ఉల్లిపాయ లేకుండా చేసే ఈ రెసిపీ పండుగ రోజుల్లో, ఉపవాస సమయాల్లో మరియు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా రాత్రి డిన్నర్‌లోకి తిరుగులేని ఎంపిక.

Phani CH
|

Updated on: Nov 26, 2026 | 5:10 PM

Share
కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ – 1 మీడియం గ్లాసు, పెసరపప్పు – పావు గ్లాసు, నీళ్లు – రెండుంపావు (2¼) గ్లాసులు (మెత్తగా కావాలనుకునేవారు 2¾ గ్లాసులు), వంట నూనె – 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు – 3, సన్నని తరుగు అల్లం ముక్క – 1 అంగుళం, తాజా కరివేపాకు – 2 రెమ్మలు, ఇంగువ పొడి – పావు టీస్పూన్, తాజా కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు – 2 నుండి 3, ఉప్పు – రుచికి సరిపడా.

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై వెడల్పాటి పాన్ లేదా కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అర టీస్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత పావు గ్లాసు పెసరపప్పు వేసి మరో 2 నిమిషాల పాటు రంగు మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి.

2 / 5
పెసరపప్పు వేగిన తర్వాత సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 అంగుళం అల్లం తరుగు వేసి ఒక్క నిమిషం వేపాలి. ఆ తర్వాత పచ్చి కరివేపాకు రెమ్మలు, పావు టీస్పూన్ ఇంగువ పొడి వేసి అంతా కలిసేలా కలపాలి ఇందులో ఉల్లిపాయలు వేయకూడదు. తాలింపు చక్కగా వేగిన తర్వాత.. వరి నూక కొలిచిన గ్లాసుతో సరిగ్గా రెండుంపావు గ్లాసుల నీళ్లు పోయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి నీళ్లు బాగా తెర్లేంత వరకు మరిగించాలి.

3 / 5
ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి.. 1 గ్లాసు వరి నూకను నీళ్లలో పోస్తూ గరిటెతో ఉండలు కట్టకుండా బాగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి మరొకసారి కలపాలి. పాన్ పై మూతపెట్టి మంటను పూర్తిగా లో ఫ్లేమ్ లో ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు నూక నీటిని పూర్తిగా పీల్చుకుని పొడిపొడిగా ఉడికే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి.

4 / 5
ఉడికిన ఉప్పుడు పిండిని ప్లేట్‌లోకి తీసుకుని.. పైన వేయించిన ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే, నోరూరించే అమ్మమ్మల నాటి సంప్రదాయ 'వరి నూక ఉప్పుడు పిండి' సిద్ధం! వేడివేడిగా ఉన్నప్పుడే పండుమిర్చి పచ్చడి, ఆవకాయ, మాగాయ లేదా కొబ్బరి చట్నీతో నంజుకుని తింటుంటే.. మధ్యమధ్యలో తగిలే పెసరపప్పు కమ్మదనం, ఇంగువ-అల్లం సువాసనతో ఎంతో తృప్తినిస్తుంది!

5 / 5
Follow Us